• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ ఎం వినోద్ బాబు తెలిపారు. జిల్లాలో 34 కేంద్రాల్లో ప్రథమ ద్వితీయ సంవత్సరానికి చెందిన 26,301 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతి సదుపాయాలు కల్పించామన్నారు.

February 22, 2026 / 05:23 AM IST

మాచర్ల అధ్యాపకుడు శ్రీనివాసరావుకు డాక్టరేట్

PLD: మాచర్లకు చెందిన అధ్యాపకుడు కాకర్ల శ్రీనివాసరావుకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శనివారం డాక్టరేట్ ప్రదానం చేసింది. ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా గ్రామీణ అభివృద్ధి, పేదరిక నిర్మూలనపై ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ గౌరవం దక్కింది. శ్రీనివాసరావు ప్రస్తుతం ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.

February 22, 2026 / 05:20 AM IST

ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

KDP: మైదుకూరు, రాజంపేట సబ్‌డివిజన్‌ల పోలీస్ అధికారులతో జిల్లా ఎస్‌పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి, డ్రగ్స్, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మహిళా భద్రత, సోషల్ మీడియా వేధింపులు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 05:16 AM IST

రాయచోటిలో శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు

అన్నమయ్య: రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మహాపూర్ణహుతి, వాసంతోత్సవం, ద్వజావరోహణ, కంకణ విసర్జణ కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు నిర్వహించారు. హంస వాహనంపై శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రుడు పురవీధుల్లో విహరించగా, కోలాటాలు, డప్పులు, మేళతాలతో ఊరేగింపు నిర్వహించారు.

February 22, 2026 / 05:14 AM IST

ఇంటర్మీడియేట్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్ : SP

అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ దీరజ్ శనివారం తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లను తప్పనిసరిగా మూసివేయాలని యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు.

February 22, 2026 / 05:13 AM IST

ఈ నెల 24 న శ్రీ సిర్లు ఎల్లమ్మ జాతర

VZM: ఈ నెల 24 నుంచి చీపురుపల్లిలోని స్దానిక కస్పా వీధిలో వెలసిన శ్రీ సిర్లు ఎల్లమాంబ జాతర ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త అడ్డూరి రామకృష్ణ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతరకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఆనవాయితీగా శ్రీ కనకమాలక్ష్మి జాతర చివర రోజున సిర్ల ఎల్లమాంబ జాతర నిర్వహిస్తారని వివరించారు.

February 22, 2026 / 05:09 AM IST

టీడీపీ 20 నెలల్లో భారీ అప్పులు: శ్రీకాంత్ రెడ్డి

 అన్నమయ్య: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా మోసపూరిత చర్యలకు పాల్పడుతోందని YCP మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం రాయచోటిలోని YCP కార్యాలయంలో ఆయన మాట్గత వైసీపి ప్రభుత్వం 3.32 లక్షల అప్పు చేస్తే, టీడీపీ ప్రభుత్వం 20 నెలల్లోనే 3. 20 లక్షల అప్పు చేసిందని, అభివృద్ధి చేయకుండా మాటలతో కాలం వెళ్లబుచ్చుతోందని విమర్శించారు.

February 22, 2026 / 05:03 AM IST

పల్నాడు అభివృద్ధిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష

PLD: పల్నాడు కలెక్టరేట్‌లో శనివారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని, మొక్కజొన్న రైతులకు మార్చి నెలాఖరు వరకు సాగునీరు అందించాలని స్పష్టం చేశారు. అలాగే, కోటప్పకొండకు రెండో ఘాట్ రోడ్డు నిర్మించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

February 22, 2026 / 04:52 AM IST

పవన్ కళ్యాణ్‌కు భారీ మెజారిటీతో గిఫ్ట్ ఇద్దాం: చలమలశెట్టి

కృష్ణ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి పవన్ కళ్యాణ్‌కు కానుకగా ఇవ్వాలని జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు పిలుపునిచ్చారు. శనివారం బాపులపాడులో భారీగా చేరికలు జరగ్గా.. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో MP బాలశౌరి, NTR జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తదితరులు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

February 22, 2026 / 04:40 AM IST

బైక్ అదుపుతప్పి, కాలువలో పడి యువకుడి మృతి

GNTR: ఫిరంగిపురం మండలం గుండాలపాడు సమీపంలోని రైస్ మిల్లు వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మునగపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రభుదాసు (24) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రాత్రి 9:30 గంటల సమయంలో బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభుదాసు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

February 22, 2026 / 04:34 AM IST

నేడు గుంటూరుకు సీఎం రాక.. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ తనిఖీ

GNTR: గుంటూరు బొమ్మిడాల నగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో ఇవాళ తపాలా శాఖ ఆధ్వర్యంలో ‘డాక్ సేవక్ సమ్మేళనం’ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సభా ప్రాంగణాన్ని సందర్శించారు.

February 22, 2026 / 04:29 AM IST

పాత గుంటూరులో పేకాట స్థావరంపై దాడి

GNTR: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అంకమ్మతల్లి దేవాలయం సమీపంలోని అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట కేంద్రాన్ని పోలీసులు ఛేదించారు. రెండో అంతస్తులో జూదం ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 45,000 నగదుతో పాటు 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

February 22, 2026 / 04:13 AM IST

చందోలులో పోలీసుల వాహన తనిఖీలు

BPT: రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు చందోలు ఎస్సై మర్రి వెంకట శివకుమార్ శనివారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణరక్షక కవచమని సూచించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు చలానాలు విధించారు.

February 22, 2026 / 12:23 AM IST

KGHలో శిశువు మృతదేహం.. పోలీసులు దర్యాప్తు

VSP: KGHలో పసికందు మృతదేహం లభ్యం కావడంతో వన్‌టౌన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. పర్యవేక్షణ అధికారి కార్యాలయానికి సమీపంలోనే నవజాతి శిశువు గోని సంచులో కుళ్లిపోగా వాసన రావడంతో రోగులు, సిబ్బంది గమనించి పరిశీలించారు. వెంటనే KGH అధికారులు, వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ పూడి వరప్రసాద్ సీసీ ఫుటేజీ పరిశీలించారు.

February 21, 2026 / 10:05 PM IST

సీసీ రోడ్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కోనసీమ: మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో దేవుడు కాలనీ నందు జరుగుచున్న సీసీ రోడ్లు, డైన్ పనులను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శనివారం పరిశీలించారు. దేవుడు కాలనీలో పనులు జరుగుచున్న ప్రతీచోట తిరిగి డ్రైన్స్ లెవిలింగ్‌ను పరిశీలించారు. నాణ్యత లోపం లేకుండా పనులు త్వరగా పూర్తిచెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 10:01 PM IST