KRNL: కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై BJP నాయకులు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పెద్దకడబూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ రాజ్ ఇవాళ అన్నారు. నిరుద్యోగంపై ప్రశ్నిస్తే దాడులు చేయడం సరైన పద్ధతి కాదని, అభివృద్ధి చేసి చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న BJP పార్టీ అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
ELR: కైకలూరులోని పెట్రోలు బంకులలో పనిచేస్తున్న సిబ్బందిని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శనివారం సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఆయా పెట్రోల్ బంకులలో ఉత్తమ సేవలు అందించిన మొత్తం తొమ్మిది మంది కార్మికులకు ప్రోత్సాహ బహుమతులు అందించామన్నారు. పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ప్రతి నెల నగదు ప్రోత్సాహాలు అందిస్తున్నామన్నారు.
W.G: ఏకీకృత కుటుంబ సర్వే పై సంబంధిత అధికారులతో పగో జిల్లా కలెక్టర్ నాగరాణి సమీక్షించారు. జిల్లాలో 6,30,947 కుటుంబాలను సర్వే చేయవలసి ఉండగా నేటి వరకు 4,73,506 కుటుంబాల సర్వేను వివిధ శాఖల సిబ్బంది పూర్తి చేయడం జరిగిందన్నారు. శాఖల వారీగా సూచించిన కుటుంబ సర్వే లక్ష్యాలను త్వరగా పూర్తిచేసి నివేదిక అందజేయాలని తెలిపారు.
అన్నమయ్య: శాసనమండలిలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి చిత్రపటాలను రాజకీయ నిరసనలకు వాడటం దైవద్రోహమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం దైవాన్ని వాడుకోవడం మహా పాపమని హెచ్చరించారు.
KDP: జమ్మలమడుగు పట్టణంలో ప్రధాన రోడ్లపై చెత్త చెల్లాచెదురుగా పడిపోవడంపై DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దాల్మియా సిమెంటు పరిశ్రమకు వ్యర్థాలను తరలిస్తున్న లారీలు పట్టణంలోకి ప్రవేశిస్తూ రోడ్లను అపరిశుభ్రం చేస్తున్నాయని ఆరోపించారు. చెత్త లారీలు బైపాస్ మార్గంలోనే వెళ్లేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నూతన రథశాల, కళ్యాణ మండపాలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు. స్వామివారిని దర్శించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 7 వరకు తిరుమల విధానంలో 11 రోజుల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
E.G: తిరుపతి వెంకటేశ్వర స్వామి వారితో వైసీపీ రాజకీయ పరాచకాలు ఆడుతోందని, రాజకీయ ఆయుధంగా వాడుకోవడం దుర్మార్గమని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి సమావేశాల్లో వైసీపీ సభ్యులు చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలను ప్రదర్శించడాన్ని తప్పుబట్టారు. వారి తీరు హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు.
అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం సిగ్గుచేటని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గౌని ప్రతాపరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. భారతజాతి ప్రయోజనాలు కాపాడమంటే పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం దుర్మార్గమన్నారు. నరేంద్ర మోడీని ప్రశ్నిస్తే దేశాన్ని ప్రశ్నించినట్టా అని పేర్కొన్నారు.
KRNL: సి.బెళగల్ మండలంలోని తిమ్మందొడ్డి పరిధిలో ఎస్సై వేణుగోపాలరాజు శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీ నిర్వహించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్‌ను పట్టుకున్నారు. మంత్రాలయం మండలం చట్నిహళ్లి నుంచి ఇసుక తరలిస్తుండగా కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు శనివారం తెలిపారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KDP: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న ఆర్‌ఐవో వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, ఫ్యాన్లు, నిరంతర విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు స్వల్ప సడలింపు ఇవ్వాలన్నారు.
ఏలూరు జిల్లా కోర్టు మానిటరింగ్ పోలీసు సిబ్బందితో ఏఎస్పీ సూర్యచంద్రరావు శనివారం సమీక్ష నిర్వహించారు. మానిటరింగ్ సెల్ ఏర్పాటు తర్వాత 47 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, అందులో 25 మందికి జీవిత ఖైదు ఖరారైందని ఆయన వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో విధులు నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందిని కోరారు. ఈ సమావేశంలో కోర్టు మానిటరింగ్ సీఐ పాల్గొన్నారు.
అన్నమయ్య: రాయచోటి వైఎస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ప్రయోజనాలను విస్మరించారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ఆపివేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సరిగా అమలుకావడం లేదని, ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు.
NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తాను ఎమ్మెల్యే భూ మా అఖిలప్రియ ఆహ్వానించారు. శనివారం ఆయన కార్యాలయంలో ఆయను మర్యాద పూర్వకంగా కలిసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు తప్పక రావాలని కోరారు. ఈ సందర్బంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విశిష్టతను ఆయన వివరించారు.
TPT: తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్రస్థాయి SAAP చెస్ లీగ్ ప్రారంభమైంది. శాప్ ఛైర్మన్ రవి నాయుడు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులను గుర్తించి శాప్ అకాడమీల్లో ప్రవేశాలు కల్పించడమే లీగ్ లక్ష్యమన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో 2,445 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు.
SKLM: పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది అని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. శనివారం పోలాకి మండలం గొల్లలవలసలో అధికారులు నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే చీపురు పట్టుకుని గ్రామంలో రహదారులను శుభ్రం చేశారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు.