• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సినిమా రంగంపై AI ముప్పు: దర్శకుడు దిలీప్ రాజా

GNTR: గుంటూరులో గురువారం జరిగిన ‘మా-ఏపి’ యూనియన్ సమావేశంలో దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల నటీనటులు, సాంకేతిక నిపుణుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. AI వినియోగంపై సెన్సార్ బోర్డు తక్షణమే స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.

February 26, 2026 / 01:35 PM IST

‘నీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వర్తించాలి’

కర్నూలు: తాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇంజినీరింగ్ విభాగ అధికారులు, సచివాలయ, తాగునీటి సరఫరా విభాగ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పీ. విశ్వనాథ్ సూచించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఇంజినీరింగ్ విభాగ అధికారులతో పాటు జూమ్ ద్వారా అమినిటీస్ కార్యదర్శులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు.

February 26, 2026 / 01:34 PM IST

హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి: ప్రిన్సిపల్ వసుధ

NLR: బుచ్చి మండలం రామచంద్రపురంలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ తరగతులతో పాటు 6 నుండి 10 తరగతుల వరకు అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపల్ వసుధ తెలిపారు. మార్చి 1తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రవేశానికి, 6, 10వ తరగతి ప్రవేశానికి సంబంధించి మార్చి 8వ తేదీన పరీక్షలు జరుగుతాయన్నారు.

February 26, 2026 / 01:33 PM IST

పేద, మధ్యతరగతి వర్గాలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

కోనసీమ: పేద, మధ్యతరగతి వర్గాల్లో అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించని వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న సీ.ఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందని  యువనాయకులు బండారు సంజీవ్ వ్యాఖ్యానించారు. ఆలమూరులో గురువారం 33 మందికి  మంజూరు అయిన రూ.15.15లక్షలు లు విలువైన చెక్కులు అందజేశారు.  ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

February 26, 2026 / 01:30 PM IST

జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించిన మంత్రి

E.G: నిడదవోలు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు. పార్టీ ఆశయాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లే ఈ సభ్యత్వ కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేవిధంగా ముందుకు సాగుతున్నామన్నారు. అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు, సభ్యత్వం ద్వారా లభించే ప్రయోజనాలను వివరించారు.

February 26, 2026 / 01:30 PM IST

చెరువులకు హంద్రీ-నీవా నీరు అందించాలి: ఎమ్మెల్యే

ATP: హంద్రీ-నీవా నుంచి PABR కాలువకు లింక్ కెనాల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం అసెంబ్లీలో కోరారు. దీని ద్వారా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 50 చెరువులకు నీరు అందించి సాగు, తాగునీటి కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

February 26, 2026 / 01:30 PM IST

‘ఈనెల 28న వయోజనుల ప్రీ-ఫైనల్ పరీక్ష’

VSP: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఉల్లాస్ కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అక్షరాంధ్ర పథకం కింద వయోజనుల కోసం ప్రీ-ఫైనల్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్‌మెంట్ టెస్ట్‌ను ఈనెల 28న నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

February 26, 2026 / 01:30 PM IST

మార్చి 1న గుంటూరుకు సుప్రీంకోర్టు సీజే

GNTR: మార్చి 1న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు నూతన భవనాల శంకుస్థాపనలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన ఏర్పాట్లపై సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొని ఏర్పాట్లను వివరించారు.

February 26, 2026 / 01:29 PM IST

విద్యుత్ ట్రాన్స్‌ఫారాల్లో కాపర్ వైర్లు చోరీ

CTR: పుంగనూరు మండలం పెంచుపల్లి గ్రామం సమీపంలోని పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫారాల్లో కాపర్ వైర్లను గుర్తు తెలియని వారు చోరీ చేస్తున్నట్లు రైతు మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం తన పొలంలో ట్రాన్స్‌ఫారం చోరీ జరిగిందని చెప్పారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

February 26, 2026 / 01:29 PM IST

‘పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి’

KKD: పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నేడు శాసనసభలో ప్రస్తావించారు.

February 26, 2026 / 01:27 PM IST

రూ.7 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

GNTR: అనారోగ్యంతో బాధపడుతున్న మంగళగిరి బాప్టిస్ట్‌పేటకు చెందిన కట్టెపోగు అనిల్‌కుమార్‌కు మంత్రి నారా లోకేష్ చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.7 లక్షలు మంజూరైంది. గురువారం బాధితుడి నివాసానికి వెళ్లి మంజూరు పత్రాన్ని టీడీపీ నాయకులు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు.

February 26, 2026 / 01:27 PM IST

కాపు రామచంద్రారెడ్డికి బీజేపీలో కీలక పదవి

ATP: రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి భారతీయ జనతా పార్టీలో కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఆయన సేవలను ఉపయోగించుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

February 26, 2026 / 01:23 PM IST

తాగునీటి పథకం జడ్పీలో విలీనం చేయవద్దు: ఎమ్మెల్యే

సత్యసాయి: జిల్లా ప్రజల దాహార్తి తీరుస్తున్న సత్యసాయి తాగునీటి పథకాన్ని జిల్లా పరిషత్తులో విలీనం చేయవద్దని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర అసెంబ్లీలో కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. విలీనం చేస్తే గ్రామ పంచాయతీలు నిర్వహణ భారమై ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. సత్యసాయిబాబా ఆశయం దెబ్బతినకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

February 26, 2026 / 01:22 PM IST

వందశాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు కృషి చేయాలి: DEO

VZM: చీపురుపల్లి పట్టణం బాలుర పాఠశాలను ఇవాళ డిప్యూటీ డీఈవో వెంకటరమణ సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన మెనూ వైట్ రైస్, కోడిగుడ్డు కూర, సాంబార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు బూసి నాయుడు, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 01:20 PM IST

లవర్‌కి పెళ్లి.. యువకుడి ఆత్మహత్య.!

TPT: చంద్రగిరి RF రోడ్డులో విషాదం నెలకొంది. కడప జిల్లాకు చెందిన సాధిక్ అనే యువకుడు తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక ఏసీ మెకానిక్ షాపులో పనిచేస్తున్న సాధిక్, పనికి రాకపోవడంతో యజమాని గదికి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

February 26, 2026 / 01:20 PM IST