• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు వేల్పూరులో వైఎస్ షర్మిల పర్యటన

PLD: ఉపాధిహామీ పథకంపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి రానున్నారు. ఈ మేరకు వినుకొండ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రామాంజనేయులు వివరాలు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాలపై భారం మోపుతోందని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన విమర్శించారు.

February 18, 2026 / 07:01 PM IST

ప్రతి రైతుకు ఆధార్ లాంటి విశిష్ట సంఖ్య అవసరం

GNTR: ఫిరంగిపురం మండలంలోని నుదురుపాడు గ్రామాన్ని గుంటూరు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎం. పద్మావతి సందర్శించి ,రైతు సేవా కేంద్రం ద్వారా రైతుల విశిష్ట నమోదు సంఖ్య నమోదు ప్రక్రియను పరిశీలించారు. పొలం ఉన్న రైతు ఈ నెలాఖరు లోపు రైతు సేవా కేంద్రాల వ్యవసాయ సహాయకుల ద్వారా ఏపీ ఎఫ్.ఆర్ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

February 18, 2026 / 07:00 PM IST

వాడపల్లి వెంకన్నను దర్శించిన మాస్టర్ శేఖర్

కోనసీమ: అత్రేయపురం(మం) పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు.

February 18, 2026 / 06:52 PM IST

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

E.G: గోకవరం మండలం గుమ్మల దొడ్డి గ్రామపంచాయతీ నందు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీపీ ఈది. రత్న అశోక్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 30 లక్షలుతో ఈ సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

February 18, 2026 / 06:06 PM IST

ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు

కోనసీమ: అమలాపురంలోని APSRTC బస్ డిపో వద్ద ఏవి డ్రైవింగ్ స్కూల్ నందు 12వ బ్యాచ్‌కు సంబంధించిన 16 మంది అభ్యర్థులు 32 రోజుల శిక్షణను పూర్తి చేసుకున్నారు. వారికి అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు సర్టిఫికెట్లు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్లు భాస్కర్ రావు, శర్మ, అధికారులు పాల్గొన్నారు.

February 18, 2026 / 05:33 PM IST