AKP: మాడుగుల మండలం జంపిన గ్రామానికి చెందిన సీరియల్ సైకో కిల్లర్ పెచ్చేటి ఉపేంద్ర బాబును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉపేంద్ర బాబు ఐదు మర్డర్ కేసులలో ముద్దాయిగా ఉన్నాడు. ఇటీవల విజయనగరం జిల్లాలో దొంగతనం కేసు మీద జైలుకు వెళ్లి వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చాడు. మారణాయుధాలతో ఉపేంద్ర బాబును హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.
అనకాపల్లి పట్టణం గవరపాలెంలో పునర్నిర్మించిన నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని వచ్చేనెల 8వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
W.G: భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వీఆర్వో, వీఆర్ఎల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. సిబ్బందికి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.
SKLM: కవిటి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో త్రినాథ్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీ ప్రణాళికలు, మండల పరిషత్తు ప్రణాళికలు (బీపీడీపీ)పై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.
కృష్ణా: అవనిగడ్డ లోని కార్ల స్టాండ్, చింత చెట్టు సెంటర్లో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వం కేవలం ఒక రాజకీయ పార్టీ సభ్యత్వం కాదని,ఇది ఒక బాధ్యత అని, ఒక నిబద్ధత, ఒక సంకల్పమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
VSP: మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీచ్‌రోడ్డులో హోటల్ సుప్రీం సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు సుమారు 50 ఏళ్ల వయస్సు, 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, ఛామనఛాయతో ఉండి తెలుపు షర్టు, జీన్స్ ప్యాంటు ధరించిన్నట్లు సీఐ దివాకర్ యాదవ్ తెలిపారు.
కర్నూలు పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగనూరు MLA బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, ఆదోని MLA పార్థసారధి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. వివిధ సమస్యలపై తనకు అందిన దరఖాస్తుల స్థితిని మంత్రి వివరించారు.
BPT: బాపట్ల డివిజన్ పరిధిలో గురువారం పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.తనిఖీల్లో భాగంగా నిబంధనలు లేని 40ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఇందులో బాపట్ల పట్టణంలో 10, రూరల్ పరిధిలో 3, చందోలులో 3, కర్లపాలెంలో 5, పర్చూరులో 12, యద్దనపూడిలో 7 బైకులు ఉన్నాయి. వీటితో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన 47 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.
NDL: పాణ్యం మండలం శ్రీ కొత్తూరులో వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో పాల్గొనమాస ఏకాదశి పూజలు శుక్రవారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున నుంచి వేద పండితులు శాస్త్రోక్తంగా కుంకుమార్చన రుద్రాభిషేకం గణపతి పూజ పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఏకాదశి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు.
NTR: విజయవాడ గొల్లపూడిలో జిల్లా ఎన్నికల గోదాంను సందర్శించి ఈవీఎంలు వీవీప్యాట్ యంత్రాల భద్రత ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాములో ఏర్పాటు చేసిన సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, అగ్నిమాపక పరికరాలు, విద్యుత్ వ్యవస్థను తనిఖీ చేసి, రిజిస్టర్ తదితర అంశాలను సమగ్రంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పష్టం చేశారు. గురువారం రాత్రి శ్రీనివాసరావుపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆమె 36 మంది లబ్ధిదారులకు రూ. 39,96,998 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు.నియోజకవర్గంలో ఇప్పటివరకు 464 మందికి రూ. 6 కోట్ల పైచిలుకు ఆర్ధిక సాయం అందించామన్నారు.
CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపనగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దక్షిణ భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, కుంకుమ, వెండి కిరీటంతో పాటు వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు దర్శించుకున్నారు.
కోనసీమ: జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్భంగా గురువారం బోడసకుర్రు BRK కన్వెన్షన్‌లో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశం జరిగింది. రాజానగరం MLA బలరామకృష్ణ, రాజోలు MLA దేవ వరప్రసాద్, కొత్తపేట ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
సత్యసాయి: బీడుపల్లిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగిన ‘జనగణన-2027’ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయి. ముగింపు సభలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి జనగణనలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన గణాంకాలు సేకరించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి అసెంబ్లీలో CM చంద్రబాబు నాయుడును కలిశారు. నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మిడ్ పెన్నారు దక్షిణ కాలువ ఆధునికీకరణ, నిలిచిపోయిన బైపాస్ కాలువ పనులను త్వరగా ప్రారంభించాలని కోరారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి రాకుండా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.