Rk roja:ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ 3 సీట్లను (seats) గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని.. ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీంతో వైసీపీ నేత, మంత్రి రోజా (roja) స్పందించారు. 3 సీట్లు (seats) గెలిస్తే చాలా? అని సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు (chandrababu), లోకేశ్ (lokesh) లక్ష్యంగా విమర్శలు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Status) ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం (Central Government) మరోసారి స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిపార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్మి నారా లోకేశ్(Nara Lokesh) ,బ్రాహ్మణిల ముద్దుల తనయుడు నారా దేవాన్ష్ (Nara Devansh) ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నారా కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) భారీ విరాళాన్ని అందజేసింది. తిరుమల కొండ మీద ఒకరోజు అన్నప్రసాద వితరణకు గానూ రూ.33 లక్షల విరాళాన్ని లోకేష్, బ్రాహ్మణి దంపతులు అందజేశారు. తిరుమలలో తరిగొండ వెంగమాంబ (Vengamamba) నిత్యాన్నప్రసాద...
ఏపీ వ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో నేటి నుంచి మరో పోషకాహారాన్ని(Nutritious Food) ఏపీ సర్కార్ అందించనుంది. ఈ పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్థులకు రాగి జావ(Ragi java)ను అందించే కార్యక్రమాన్ని మంగళవారం సీఎం జగన్(CM Jagan) లాంఛనంగా ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా రూ.86 కోట్ల అదనపు వ్యయాన్ని కేటాయించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రార...
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అంటే విపరీతంగా ఇష్టపడే ఆయన స్నేహితుడు ఆలీ(Ali) జగన్(Jagan) పార్టీ చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆలీ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆలీ బాటలోనే మరో పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ చేరారు. పవన్ అంటే పడి చచ్చే బండ్ల గణేష్(Bandla Ganesh) తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏపీలో జగన్ పాలన బావుందన్న ఆయన టీడీపీ, జనసేన(TDP-Janase...
తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు(Devotees) తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం టికెట్ల(Tickets)ను బుక్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్న వారికి టీటీడీ(TTD) శుభవార్త చెప్పింది. నేడు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. శ్రీవాణి టికెట్లకు సంబంధించి జూన్ నెల ఆన్ లైన్ కోటాను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు ట...
ఏపీ(AP)లో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు(Rain) కురుస్తున్నాయి. భారీ ఈదుర గాలులు, వడగళ్ల వర్షంతో రాష్ట్ర ప్రజలు హడలెత్తిపోయారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్(Alert) జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. నవ్వుతూ ఆమె కనిపించారు. తన కారులో తుగ్లక్ రోడ్డులో గల సీఎం కేసీఆర్ నివాసానాకి బయల్దేరారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దాదాపు 10.30 గంటలపాటు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నలు కురిపించారు. రేపు విచారణకు రావాలని కవితను ఈడీ అధికారులు ఆదేశించారు.
విద్యార్థుల పేరిట జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం(skill development scam) దేశ చరిత్రలోనే అతిపెద్దదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(Jagan mohan reddy) ఆరోపించారు. ఈ స్కాం వెనుక ప్రధానంగా చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ఉండి నడిపించారని ఆరోపించారు. ఈ క్రమంలో మూడు నెలల్లోనే రూ.371 కోట్లు పక్కదారి పట్టించారని ఏపీ అసెంబ్లీలో సోమవారం పేర్కొన్నారు.
Pawan Kalyan : అసెంబ్లీలో టీడీపీ నేతలపై దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం సభలో జీవో నెంబర్ 1పై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. అయితే టీడీపీ సభ్యుల తీరుపై వైస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు కూడా పోడియం వద్దకు వెళ్లారు.
CPI Narayana : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన సంఘటనపై సీపీఐ నారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వారు మనుషులా? పశువులా? అని నిలదీశారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదని నారాయణ అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీలో ఇష్టారీతీన వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హద్దు మీరితే శాశ్వతంగా చట్ట సభలకు రాకుండా చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మంత్రి ఆర్కే రోజా సోమవారం డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేల పైన జరిగిన దాడిని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. శాసన సభలోనే ఎమ్మెల్యేల పైన దాడి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు చీకటి రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు.
పవిత్రమైన నిండు సభలో సభ్యులపై వైఎస్సార్ సీపీ దాడులకు పాల్పడిందని టీడీపీ సభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించాడు. తన రౌడీయిజాన్ని అసెంబ్లీలో కూడా వైసీపీ చూపిస్తోందని మండిపడ్డాడు. బయటకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.
తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ లు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు.