Kavitha:హామ్మయ్యా.. బయటకు వచ్చిన కవిత, నవ్వుతూ ఇంటికి చేరి..
Kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. నవ్వుతూ ఆమె కనిపించారు. తన కారులో తుగ్లక్ రోడ్డులో గల సీఎం కేసీఆర్ నివాసానాకి బయల్దేరారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దాదాపు 10.30 గంటలపాటు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నలు కురిపించారు. రేపు విచారణకు రావాలని కవితను ఈడీ అధికారులు ఆదేశించారు.

ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సుధీర్గంగా విచారించారు. కవితతోపాటు అమిత్ ఆరోరా, మనీష్ సిసోడియాను కూడా కలిపి విచారించారు. అంతకుముందు ఈడీ ఆఫీసు వద్ద హైటెన్షన్ నెలకొంది. అక్కడికి పోలీసు బలగాలతోపాటు కేంద్ర బలగాలు (central forces) చేరుకున్నాయి. ఈ నెల 11వ తేదీన కూడా కవితను (kavitha) ఈడీ విచారించింది. ఆ రోజు రాత్రి 8 గంటలకు ఇంటికి పంపించేసింది. ఈ సారి మాత్రం రాత్రి 9.30 గంటలకు పంపించింది.
అంతకుముందు ఈడీ కార్యాలయం (ed offica) వద్ద ఉన్న జాగృతి కార్యకర్తలు, కవిత అనుచరులు, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్కడినుంచి పంపించివేశారు. ఈ రోజు సాయంత్రం ఈడీ కార్యాలయానికి ఏజీ వెళ్లడంతో హైటెన్షన్ నెలకొంది. కవిత లాయర్లు గండ్ర మోహన్, భరత్.. వైద్యులు.. అందులో ఒక మహిళ ఉన్నారు. ఈడీ ఆఫీసు వద్ద వర్షం కురిసినా సరే కవితను విచారించారు.
ఢిల్లీలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, కవిత భర్త అనిల్, ఇతర నేతలు ఉన్నారు. సీఎం కేసీఆర్ కూడా ఆత్మీయ సందేశం ఇచ్చారు. కవిత బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.