ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు పదిన్నర గంటలపాటు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ ఆఫీస్ కు కవిత న్యాయవాదుల బృందం కూడా చేరుకోవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈడీ ఆఫీస్ కు తెలంగాణ అడిషనల్ ఏజీ రామచంద్రరావు తో పాటు, న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, సోమా భరత్ కుమార్ కూడా చేరుకున్నారు. పదిన్నర గంటల పాటు సాగిన ఈడీ విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు ఎస్కార్ట్ వాహనంతో ఎమ్మెల్సీ కవితకు కాన్వాయ్ ఏర్పాటు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor scam) కేసులో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఈడీ విచారణ ముగిసింది. దాదాపు పదిన్నర గంటలపాటు కవితను ఈడీ(ED) అధికారులు ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ లో కవిత పాత్రపై ఆరా తీశారు. అలాగే సౌత్ గ్రూప్ లో ఉన్న వ్యక్తులతో వ్యాపార సంబంధాలపై ఆమెను ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. అంతేకాకుండా ఈడీ ఆఫీస్(ED Office)కు కవిత న్యాయవాదుల బృందం కూడా చేరుకోవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.
ఈడీ ఆఫీస్(ED Office)కు తెలంగాణ అడిషనల్ ఏజీ రామచంద్రరావు తో పాటు, న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, సోమా భరత్ కుమార్ కూడా చేరుకున్నారు. పదిన్నర గంటల పాటు సాగిన ఈడీ విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు(Delhi Police) ఎస్కార్ట్ వాహనంతో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు కాన్వాయ్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రామచంద్ర పిళ్లైతో కలిపి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ(ED) అధికారులు ప్రశ్నించారు. కవిత(Kavitha)ను రేపు మరోసారి ఈడీ అధికారులు విచారణకు పిలిచారు.