తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ లు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు.
తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ లు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. తన ప్రభుత్వం బాగా పని చేయడం లేదు అని భావిస్తే.. వారికి దమ్ముంటే వొంటరిగా పోటీ చేయగలరా అని సవాల్ చేశారు. నేను వారికి నేరుగా సవాల్ విసురుతున్నాను, చంద్రబాబుకు, దత్తపుత్రుడికి 175 స్థానాల్లో వొంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా, దమ్ము, ధైర్యం ఉన్నాయా అన్నారు. వాళ్ళలా నేను పొత్తుల కోసం వెంపర్లాడటం లేదు అన్నారు. నేను నమ్ముకున్నది ప్రజలను, దేవుడిని అన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరకు గెలిచేది ధర్మమే అన్నారు. రామాయణం, భారతం, బైబిల్, ఖురాన్.. ఏవి చెప్పిన ఇదే చెబుతాయి అన్నారు. మనం ఏదైనా సినిమాకు వెళ్ళినా హీరో నచ్చుతాడు.. తప్ప విలన్ నచ్చదు అన్నారు.
ఇదిలా ఉండగా… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అయితే పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన బాధ కనిపించకుండా జాగ్రత్తపడాలని ముఖ్యమంత్రి జగన్ తన మంత్రులు, పార్టీ ముఖ్య నేతలకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు, వీటికీ పొంతన లేదని చెప్పాలని అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో డిగ్రీ చదివిన వారు మాత్రమే ఓటేస్తారని, అన్ని వర్గాల ప్రజలూ మన వైపే ఉన్నారనే విషయం చెప్పాలని సూచించారని తెలిసింది.