ASR: జిల్లాలో వ్యవసాయ, యంత్ర రుణాలు పెంచుతూ, ప్రభుత్వ పథకాలు రైతులకు అందేవిధంగా చూడాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతులకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. రైతులకు, పశు సంవర్థక, ఫిషరీస్, పట్టు పరిశ్రమలకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలు మంజూరు చేయాలన్నారు.