పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అంటే విపరీతంగా ఇష్టపడే ఆయన స్నేహితుడు ఆలీ(Ali) జగన్(Jagan) పార్టీ చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆలీ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆలీ బాటలోనే మరో పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ చేరారు. పవన్ అంటే పడి చచ్చే బండ్ల గణేష్(Bandla Ganesh) తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏపీలో జగన్ పాలన బావుందన్న ఆయన టీడీపీ, జనసేన(TDP-Janasena) కూటమి గెలవాలని తాను కోరుకోవడం లేదన్నారు.

ఏపీ(AP)లో జగన్ ఓడిపోవాలని తాను కోరుకోవడం లేదని, దేశంలో ఎక్కడా లేని ఉచిత పథకాలు ఏపీలో ఉన్నాయన్నారు. అలా ఉచిత పథకాలు ఇవ్వడం మంచి పద్దతి కాదన్నారు. కానీ విద్య, వైద్యం వంటివాటిలో ఉచిత పథకాలు ప్రజలకు అవసరం అన్నారు. టీడీపీ, జనసేన(TDP-Janasena) పొత్తుపై యాంకర్ అడిగిన ప్రశ్నకు బండ్లగణేష్ సమాధానమిస్తూ..టీడీపీ, జనసేన కలిస్తే కడుపు వస్తుందా? లేకుంటే కడుపు రాకుండానే డెలివరీ అవుతుందా అని విమర్శలు చేశారు.
తెలంగాణ(Telangana)లో తనకు రైతు బంధు పథకాన్ని అందించారని, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది కాబట్టి తాను తీసుకున్నానని బండ్ల గణేష్(Bandla Ganesh) అన్నారు. ఇకపోతే తన అభిమాన హీరో పవన్ కచ్చితంగా సీఎం అవుతాడని, అయితే ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడనే విషయం మాత్రం చెప్పలేనని అన్నాడు. కానీ ఏపీలో మాత్రం సీఎం జగన్(Cm Jagan) ఓడిపోవడం తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్(Bandla Ganesh) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.