»Rain Alert For Several Districts In Andhra Pradesh
Rain Alert: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు
ఏపీ(AP)లో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు(Rain) కురుస్తున్నాయి. భారీ ఈదుర గాలులు, వడగళ్ల వర్షంతో రాష్ట్ర ప్రజలు హడలెత్తిపోయారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్(Alert) జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

నేడు, రేపు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు(Huge Rain) కురిసే అవకాశం ఉందని ఐఎండీ(IMD) అధికారులు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు(Rain) పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ(AP) వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ వరకు ద్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు(Rain) కురుస్తాయని, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.