వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరిని సీబీఐ అఫ్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేశాడు.
MLA Ramakrishna : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆర్కే హాజరు కాకపోవడంతో... ఆయన పార్టీ వీడుతున్నారంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.
కాన్ఫరెన్స్ హాల్ లో సిబ్బంది సినిమా పాటలకు డ్యాన్స్ లు చేస్తూ రచ్చరచ్చ చేశారు. క్లబ్ లు.. పబ్ ల్లో మాదిరి స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రికార్డింగ్ డ్యాన్స్ లు మాదిరి చేయడం తీవ్ర దుమారం రేపుతున్నది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ వ్యాఖ్యలు
Mekapati : పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత... మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి... రాజకీయంగా మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన .. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కలిశారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు.
Jogi Ramesh : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం విదితమే. ఈ సమావేశంలో జగన్..... ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొందరికి జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని హితబోధ చేసినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతలతో కలుస్తూ, పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం మురళీధర రావుతో భేటీ అనంతరం పవన్ ను మీడియా ప్రశ్నించగా.. ఇంకా పలువురు నేతలను కలవాల్సి ఉందని, అందరినీ కలిశాక మాట్లాడుతానని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు ఎవరూ చంద్రబాబుకు ఓటేయరని చెప్పారు.
అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశ్వచంద్ కొల్లా అనే డాటా ఆనలిస్ట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. బోస్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద ఉండగా.. బస్సు ప్రమాదం జరిగింది.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తమ పార్టీ నేత నాదేండ్ల మనోహర్ తో కలిసి ఆయన ఢిల్లీలో పలువురు బీజేపీ నేతలతో సమావేశమౌతున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై క్లారిటీ కోసం ఆయన సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.