»Mekapati Meeting With Ex Minister Dl Ravindra Reddy
Mekapati Meeting With DL : మాజీ మంత్రి డీఎల్ తో మేకపాటి భేటి..!
Mekapati : పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత... మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి... రాజకీయంగా మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన .. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కలిశారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు.
పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత… మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి… రాజకీయంగా మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన .. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కలిశారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. ఇద్దరు నేతలు దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. అయితే… ఇప్పుడు వీరు ఏం మాట్లాడుకున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా… మేకపాటి, సీఎం జగన్ సహా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇటు డీఎల్ రవీంద్రారెడ్డి కూడా జగన్ సర్కార్‌ను టార్గెట్ చేశారు.. ఈ క్రమంలో ఇద్దరి భేటీ చర్చనీయాంశమైంది. మేకపాటిని నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వబోమని వైస్సార్సీపీ నేతలు హెచ్చరించడం, బస్టాండ్ సెంటర్‌కు వెళ్లి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుని మేకపాటి సవాల్ చేయడంతో ఉదయగిరిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దమ్ముంటే ఎవరొస్తారో రండి అంటూ సవాల్ చేశారు.
అప్పటి నుంచి ఉదయగిరి రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే మేకపాటికి కౌంటర్‌గా వైఎస్సార్సీపీ నేతలు కూడా బస్టాండ్ దగ్గర కుర్చీ వేసుకుని ప్రతి సవాల్ విసిరారు.