AP MLC Elections: ఆ పేర్లు బయటపెట్టం, చంద్రబాబు ఇందులో దిట్ట.. సజ్జల
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) తమ పార్టీకి చెందిన ఇద్దరు క్రాస్ ఓటింగ్‌కు (Cross Voting) పాల్పడ్డారని, వారిని గుర్తించామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. వారి పేర్లను ఇప్పుడే చెప్పబోమన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) తమ పార్టీకి చెందిన ఇద్దరు క్రాస్ ఓటింగ్‌కు (Cross Voting) పాల్పడ్డారని, వారిని గుర్తించామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. వారి పేర్లను ఇప్పుడే చెప్పబోమన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం, చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవడానికి ఇది రాజకీయమని, ఉద్యోగం కాదన్నారు. తమకు సంఖ్యాబలం ఉందనే పోటీ పెట్టామని, నలుగురు టీడీపీ (TDP), ఒక జనసేన ఎమ్మెల్యే (Janasena MLA) తమకు మద్దతు పలుకుతున్నారన్నారు. అయితే తమ పార్టీ నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) టీడీపీకి ఓటు వేసినా.. మాకు తెలియదు కానీ.. ఒకవేళ అలా వేసినా వారికి 21 సభ్యుల బలమే ఉంటుందని, కాబట్టి తమ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఓటు వేయడంతో పంచుమర్తి అనురాధకు (Panchumarthi Anuradha) 23 వచ్చాయన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారితో కలుపుకుంటే తమకు బలం ఉంది కాబట్టే ఏడుగురిని నిలబెట్టామన్నారు.
ప్రజల బాధలు, రాష్ట్రం గురించి పట్టించుకోవడం కంటే ఇలాంటి ఎత్తులు, విద్యల్లో టీడీపీ అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) బాగా ఆరితేరారన్నారు. ఆయన నాలుగు దశాబ్దాల క్రితం తెలుగు దేశం పార్టీలో ఎంటర్ అయినప్పటి నుండి ఇదే పద్ధతిని అవలంభించారన్నారు. ఆయన సహజంగా తన నేర్పరితనాన్ని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ప్రదర్శించారని ఎద్దేవా చేశారు. మేం ఏడుగురు అభ్యర్థులను పోటీకి పెట్టిన తర్వాత, మేం చేయాల్సిన ప్రయత్నాలు అన్నింటిని చేశామన్నారు. అసంతృప్తితో ఉన్న తమ ఎమ్మెల్యేలతో మాట్లాడామన్నారు. ఆ లెక్కన ఏడు ఎమ్మెల్సీలను తాము గెలుచుకోవాలని, కానీ టీడీపీ ఎవరినో ప్రలోభపెట్టినట్లుగా తెలిసి పోతుందని చెప్పారు. ప్రలోభాలకు గురైనవారు చంద్రబాబు పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆయన వాడుకొని వదిలేసే రకం అన్నారు. టీడీపీ కూడా ఒక ఎమ్మెల్సీ గెలిచి.. ఇదే బలం అనుకొని, ఇక వచ్చేసారి తమదే అధికారం అనుకుంటే అది ఆయన పిచ్చి అన్నారు. ప్రలోభాలకు గురైంది ఎవరో చూడాలన్నారు. ఏం చేయాలనేది పార్టీలో చర్చిస్తామన్నారు.
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన ఆరుగురు మర్రి రాజశేఖర్, బొమ్మి ఇజ్రాయెల్, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, పెన్మత్స సూర్యనారాయణ రాజు, జయమంగళ వెంకటరమణ, టీడీపీ నుండి పంచుమర్తి అనురాధ గెలిచారు.