Mekapati v/s chejarla:మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati chandrasekar reddy) వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి (chejerla subbareddy) మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. సవాల్- ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది.
Mekapati v/s chejarla:నెల్లూరు పాలిటిక్స్ హీటెక్కాయి. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati chandrasekar reddy) వర్సెస్ వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి (chejerla subbareddy) మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. వచ్చేసారి మేకపాటికి (mekapati) టికెట్ ఇవ్వమని సీఎం జగన్ (cm jagan) చెప్పారట. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతోపాటు చేజర్ల సుబ్బారెడ్డి (subba reddy) నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆయనకు టికెట్ కన్ఫామ్ అని తెలియడంతో.. మేకపాటిపై వరసగా ఆరోపణలు చేస్తున్నారు.
ఉదయగిరి వస్తే తరిమి కొడతామని మేకపాటిని (mekapati) చేజర్ల (chejerla) గట్టిగానే హెచ్చరించారు. దీంతో నిన్న బస్టాండ్ సెంటర్ (busstand centre) వద్దకు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి.. కూర్చి వేసుకొని కూర్చున్నారు. దమ్ముంటే ఇక్కడికి రావాలని ప్రతీ సవాల్ విసిరారు. ఈ రోజు చేజర్ల సుబ్బారెడ్డి (subba reddy) అక్కడికి వచ్చారు. మేకపాటి (mekapati) ఇక్కడికి వస్తారా.. తననే రమ్మంటారా అని అడిగారు.
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati chandrashekar reddy) ఇంట్లోనే ఉన్నారు. ఆయన అనారోగ్యంతో ఉన్న ట్టు తెలుస్తోంది. గుండె పోటు (heart stroke) వచ్చిందని.. ఆయనను తొలుత నెల్లూరు.. అటు నుంచి చెన్నై (chennai) తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. చేజర్ల నుంచి కూడా తీవ్రంగా ప్రతిఘటన వస్తోంది. ఇదివరకు కూడా మేకపాటి అస్వస్థతకు గురయ్యారు. గుండె వాల్వ్స్ మూసుకుపోవడంతో చికిత్స అందించారు. ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది.
మేకపాటి (mekapati) గత కొద్దిరోజులగా హైకమాండ్‌పై ధిక్కార స్వరం వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మేకపాటితోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.