Cancer: క్యాన్సర్ వ్యాధి ఎంత ప్రాణాంతకమో తెలిసిందే. అయితే ఈ వ్యాధిని వంటింట్లో దొరికే దినుసుల సాయంతో నయం చేసే విధానాన్ని మద్రాస్ ఐఐటీ పరిశోధకులు ఆవిష్కరించారు. దీనిపై తాజాగా పేటెంట్ కూడా పొందారు. ఈ ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి 2028 నాటికి మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దపేగు, గర్భాశయ, నోటి, థైరాయిడ్ క్యాన్సర్లను మసాలాల నుంచి సేకరించిన నానోమెడిసిన్తో నయం చేయవచ్చని ఐఐటీ మద్రాస్ పరిశోధకులు నిరూపించారు.
ఈ ఔషధంతో జంతువులపై ప్రయోగాలు చేయగా.. సానుకూల ఫలితాలు వచ్చాయి. త్వరలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నారు. అయితే ప్రస్తుతం తక్కువ ఖర్చుతో ఎలా ఉత్పత్తి చేయాలన్నదానిపై దృష్టిపెట్టినట్లు మద్రాస్ పరిశోధకులు తెలిపారు. అలాగే తీవ్ర్రమైన ఒత్తిడి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్స్, గుండె సమస్యల బారిన పడటంతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.