Cold Water : అతిగా ఐస్ వాటర్ తాగితే ఏం అవుతుందో తెలుసా?
ఎండలు కొద్ది కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి. అందుకనే మన దృష్టి ఒక్కసారిగా ఐస్ వాటర్ మీదకు మళ్లుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఇలా ఫ్రిజ్ వాటర్‌నే తాగితే ఏం అవుతుందో తెలుసా?
fridge water side effects : ఎండలు కాస్త ఎక్కువ అవతున్నాయంటే చాలా మనం కూల్ డ్రింక్‌లు, అతి చల్లగా ఉండే నీళ్లను తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాం. కొందరైతే ఏ కాలంలో అయినా ఫ్రిజ్ నుంచి తీసిన చల్లటి నీటినే తాగుతూ ఉంటారు. అయితే మనం నీరు తరచుగా తాగడం అనేది మన ఆరోగ్యం విషయంలో చాలా ముఖ్యమైన విషయం. మన బాడీ హైడ్రేటెడ్‌గా ఉండి అన్ని పనులను సక్రమంగా నిర్వర్తించుకోగలగాలంటే తగినంత నీరు తాగాల్సిందే.
అయితే అతి చల్లని నీటిని తరచుగా తాగుతూ ఉండటం వల్ల తరచుగా మన శరీర ఉష్ణోగ్రతల్లో అసమతుల్యత చోటు చేసుకుంటుంది. అలాగే జీర్ణ ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. అందువల్ల అజీర్ణం, మల బద్ధకం( constipation), పొట్ట సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మరీ ముఖ్యంగా మనం ఆహారాన్ని తీసుకునే సమయంలో అతి చల్లని నీటిని తాగకుండా ఉండటం ఎంతో అవసరం. ఫ్రిజ్‌లో నీరు తాగడం వల్ల తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు లాంటివీ రావొచ్చు.
వేసవి కాలం(summer) లో బయటి వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి అతి చల్లని నీటిని తాగడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు కొంత వరకు తక్కువగా ఉంటాయి. అలాగే జ్వరం, జలుబు లాంటివి కొంత మందికి దీర్ఘకాలం పాటు వేదిస్తుంటాయి. అలాంటి వారు ఈ నీటికి చాలా దూరంగా ఉండాలి. అతి చల్లగా లేదా అతి వేడిగా ఉండే నీటిని తాగడం కంటే సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీటిని తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని, అలాగే దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.