»A Tamil Nadu Town Is Offering Tasty Healthy Modi Idlis For Rs 10 A Plate
Chennai: ‘మోదీ ఇడ్లీ’కి అపూర్వ స్పందన
బీజేపీ కార్యకర్త ఒకరు చెన్నైలో నడుపుతున్న ‘మోదీ ఇడ్లీ’ దుకాణానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రూ. పదికే మూడు ఇడ్లీలను దుకాణదారుడు ఇస్తుండటంతో స్థానికులు ఆసక్తిగా వీటిని కొనుగోలు చేసి తింటున్నారు.
Chennai Modi Idly : చెన్నైలోని స్థానిక కేకే నగర్ (వెస్ట్) ఉమనుసామి రోడ్డులో బీజేపీ కార్యకర్త ఒకరు ‘మోదీ ఇడ్లీ’ పేరుతో ఓ దుకాణాన్ని నడుపుతున్నారు. సేవా భావంతో వారు నడుపుతున్న ఆ అంగడిలో రూ.10కే మూడు ఇడ్లీలలను ఇస్తున్నారు. అలాగే రూ.5కే ఒక వడను అందిస్తున్నారు. దీంతో మోదీ ఇడ్లీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. శని, ఆది వారాల్లో ఈ దుకాణానికి సెలవు. మిగిలిన రోజుల్లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మాత్రమే దీన్ని నడుపుతున్నారు.
ఈ విషయమై దుకాణ యజమాని గోపీనాథన్ మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్లో దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతి రోజూ 280 వరకు ఇడ్లీలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. సేవా భావంతో మాత్రమే తాను ఈ దుకాణాన్ని నడుపుతున్నట్లు చెప్పారు. తొలినాళ్లలో ఆదరణ తక్కువగానే ఉండేదన్నారు. అయినా పది రూపాయలకే నాణ్యమైన ఇడ్లీలను మోదీ ఇడ్లీ(Modi Idly) పేరుతో ఇస్తుండటం వల్ల క్రమంగా విక్రయాలు పెరిగినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఈ విక్రయశాల దగ్గర ఉద్యోగులు, కార్మికులు, పేదలు తదితరులు బారులు తీరి మరీ ఇడ్లీలను, వడలను కొనుక్కుంటున్నారు. త్వరలోనే విరుగంబాక్కం శాసన సభ నియోజకవర్గంలో పది ప్రాంతాల్లో ఈ ‘మోదీ ఇడ్లీ’ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. గతంలోలా అమ్మ క్యాంటీన్లు సరిగ్గా నడవకపోవడం వల్లనే ఇలా మోదీ ఇడ్లీ దుకాణంలో విక్రయాలు పెరుగుతున్నాయని అన్నారు.