We are with cm jagan, not change the party:Vallabhanani vamsi
Vallabhanani vamsi:ఏపీ రాజకీయాల్లో పార్టీ మార్పు అంశం హాట్ టాపిక్ అవుతుంది. తమతో 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టీడీపీ నేతలు కామెంట్ చేయడంతో కలకలం రేగింది. చాలా మంది పేరు వినిపించినా.. వల్లభనేని వంశీ (Vallabhanani vamsi), కొడాలి నాని (kodali nani) పేర్లు కూడా వచ్చాయి. దీంతో నిజంగా వీరు టీడీపీ గూటికి చేరతారా అనే సందేహాం వచ్చింది. ఇదే అంశంపై వల్లభనేని వంశీ (vamsi)స్పందించారు. నాని, తాను పార్టీ మారడం లేదని తేల్చిచెప్పారు. తామిద్దరం పార్టీ మారతామని కొందరు మెరుపు కలలు కంటున్నారని వంశీ విమర్శించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పరీక్ష రాస్తున్నానని. అందుకే సమీక్షకు వెళ్లలేదని వంశీ (vamsi) తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని టీడీపీ మైండ్ గేడ్ ఆడుతున్నారని విమర్శించారు. పనిలో పనిగా నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్రపై కూడా విమర్శలు చేశారు. ఆ పాదయాత్ర వల్ల ఎలాంటి మేలు జరగదని చెప్పారు.
ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడం వల్ల వైసీపీకి (ycp) జరిగే నష్టమేమి లేదని వంశీ (vamsi) అభిప్రాయపడ్డారు. క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురికి చంద్రబాబు (chandrababu) ఏం ఆశ చూపించారని అడిగారు. ఈ విషయం అందరికీ తెలుసు అని చెప్పారు. ఇదివరకు మాదిరిగా చంద్రబాబు.. ఆయన అనుచరులు పట్టుబడలేదని గుర్తుచేశారు. ఇదివరకు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో ఓటుకు కోట్లు ఇస్తూ టీడీపీ నేతలు పట్టుబడిన సంగతి తెలిసిందే.
చదవండి:Chandra Babuకు ఓటేస్తే చేయి నరుక్కున్నట్టే.. మంత్రి ధర్మాన హాట్ కామెంట్స్
గోబెల్స్ కబుర్లు చెప్పడంలో చంద్రబాబు (chandrababu) నంబర్ వన్ అని చెప్పారు. 2019 ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున కూడా ఇలాగే చెప్పారని గుర్తుచేశారు. తమకే ఇన్ని కథలు చెబితే.. ఇక క్యాడర్ సంగతి ఏంటీ అని అడిగారు. టీడీపీ ముందస్తు ఎన్నికల చెప్పడం వెనక.. విరాళాలు సేకరించడం ఉందన్నారు.
తారక్‌ను (ntr) బ్లాక్ చేయడం కోసమే లోకేశ్ (lokesh) ప్రత్యక్ష రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యారని వంశీ విమర్శించారు. అందుకోసమే యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారని పేర్కొన్నారు. రికార్డ్ కోసమే తప్ప.. ఆ పార్టీకి ఏ మాత్రం ఓటు పెరగదని వంశీ (vamsi) స్పష్టంచేశారు. లోకేశ్ ఎక్కడ ఉన్న ఒక్కటేనని మండిపడ్డారు.
చదవండి:Chandra Babuకు ఓటేస్తే చేయి నరుక్కున్నట్టే.. మంత్రి ధర్మాన హాట్ కామెంట్స్
వంశీ- నాని మంచి స్నేహితులు. నాని వైసీపీలో ఉండగా.. వంశీ టీడీపీ నుంచి పోటీ చేశారు. తర్వాత వైసీపీలో చేరాలంటే.. పదవీకి రాజీనామా చేసి బరిలోకి దిగాలని సీఎం జగన్ సూచించారట. అందుకే వైసీపీ అనుబంధ శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. తాను గెలిచినా.. టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మాత్రం విమర్శలు చేస్తుంటారు.