• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దామచర్ల సత్యను గజమాలతో సత్కరించిన నేతలు

ప్రకాశం: రాష్ట్ర మారీటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య జన్మదిన శుభ సందర్భంగా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు అడ్డరోడ్డు వద్ద స్థానికులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేయించారు. మండల పార్టీ అధ్యక్షుడు పోకూరి రవి, కామేపల్లి ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోటు మురళి ఆధ్వర్యంలో సింగరాయకొండ వెళ్తున్న సత్యను గజమాలతో సత్కరించారు.

March 5, 2026 / 02:41 PM IST

పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: కలెక్టర్

KRNL: 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాలో జరగబోయే పదో తరగతి పరీక్షలను అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలలో అన్ని వసతులను ఒకరోజు ముందుగానే పూర్తి చేయాలని తెలిపారు.

March 5, 2026 / 02:40 PM IST

‘ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి’

నెల్లూరు: ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన రైతు సాధికార సంస్థ క్యాడర్ సభ్యుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విత్తనాలు విత్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో DPM కన్నయ్య పాల్గొన్నారు.

March 5, 2026 / 02:40 PM IST

ఘనంగా శ్రీవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

W.G. పెంటపాడు మండలం మీనావల్లూరు గ్రామంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నియోజకవర్గం ఇంఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు పాల్గొన్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

March 5, 2026 / 02:40 PM IST

‘మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

PLD: మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మాచవరం సచివాలయంలో గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు పలు రకాల వ్యాధుల గురించి ఆ గ్రామాల వైద్య సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమం మహిళల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించామని ఎంపీడీవో విష్ణు చిరంజీవి అన్నారు.

March 5, 2026 / 02:38 PM IST

రైతు సంక్షేమమే మా లక్ష్యం: బల్లా పల్లవి

ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌లో రైతుల సమస్యల పరిష్కారంపై ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి గురువారం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. యార్డుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వారికి గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలని వ్యాపారులను కోరారు. మార్కెట్ ప్రాంగణంలో మెరుగైన సౌకర్యాల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు.

March 5, 2026 / 02:35 PM IST

రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన రూరల్ సీఐ

PLD: రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌ను రూరల్ సీఐ సుబ్బారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం నిఘా ఉంచాలని ఎస్సై లోకేశ్వరరావును ఆదేశించారు.

March 5, 2026 / 02:35 PM IST

గొలుగొండలో పాసుపుస్తకాలు పంపిణీ

AKP: గొలుగొండ మండలం సాలికమల్లవరం పంచాయతీ పొగచెట్లపాలెం రెవెన్యూ గ్రామంలో భూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. తహసీల్దార్ కాకర నూకరాజు ఆదేశాల మేరకు ఈ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని సర్వే డీటీజీ కొండబాబు, వీఆర్వో పడాల్ తెలిపారు. అనంతరం పాసుపుస్తకాల ఉపయోగాలను రైతులకు వివరించారు.

March 5, 2026 / 02:33 PM IST

‘బాల్యవివాహలను అరికట్టడంలో భాగస్వాములు కావాలి’

CTR: బాల్యవివాహలను అరికట్టడంలో అందరు భాగస్వామ్యలు కావాలని ఐసీడీఎస్ పర్యవేక్షకులు శ్యామల పేర్కొన్నారు. గురువారం విజయపురం(మం) శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు బాల్యవివాహాలు అంశంపైన అవగాహనా శిబిరం నిర్వహించారు. బాల్యంలోనే వివాహం చేసుకున్న అమ్మాయిలకు ఉజ్వల భవిష్యత్తు ఉండదని పర్యవేక్షకులు లక్ష్మి చెప్పుకొచ్చారు.

March 5, 2026 / 02:32 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన జేసీ

పార్వతీపురం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను జిల్లా సంయుక్త కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని, మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.

March 5, 2026 / 02:27 PM IST

యువకుడు అదృశ్యం.. కేసు నమోదు

KDP: మైదుకూరు చెందిన మారుతి కుమారుడు మహిధర్ (25) అదృశ్యమైనట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల కిందట పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఎంతకు రాకపోవడం, బంధువులు దగ్గర లేకపోవడంతో తండ్రి మారుతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మంగారిమఠంలో సంచారం చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

March 5, 2026 / 02:24 PM IST

సెన్సస్ శిక్షణ మూడవ రోజు నిర్వహణ

TPT: జిల్లా స్థాయి సెన్సస్ శిక్షణ కార్యక్రమంలో మూడవ రోజు సెన్సస్ ప్రాముఖ్యత, ప్రతి వ్యక్తిని ఖచ్చితంగా లెక్కించే అవసరం, డిజిటల్ విధానం, కుల సెన్సస్‌పై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర జనగణన కార్యకలాపాల డైరెక్టర్, పౌర నమోదు డైరెక్టర్ జే. నివాస్, కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గోన్నారు.

March 5, 2026 / 02:23 PM IST

ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: అమరావతిలోని శాసనసభ ప్రీ విలేజ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ప్రీ విలేజ్ కమిటీ అధ్యక్షులు పి. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. శాసనసభ హక్కులు, సభ్యుల బాధ్యతలు, కమిటీ పరిధిలో ఉన్న అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

March 5, 2026 / 02:22 PM IST

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ

KRNL: పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామానికి చెందిన వడ్డె రాముడు భార్య వడ్డె సునీతకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 30,028 చెక్కును టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్కన్న గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలాంటిదని స్పష్టం చేశారు.

March 5, 2026 / 02:20 PM IST

ఈనెల 9న కాకినాడలో ప్రైమ్ మినిస్టర్ అప్రెంటిస్ మేళా

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలలో వివిధ కంపెనీలలో ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయుటకు గవర్నమెంట్ ఐటిఐ కళాశాల కాకినాడలో ఈనెల 9న ప్రైమ్ మినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ఐటిఐ పాస్ అయిన అభ్యర్థులు సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94404-08182 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

March 5, 2026 / 02:17 PM IST