CTR: పుంగనూరు మండలం షుగర్ ఫ్యాక్టరీ సమీపాన వెంకట్ రెడ్డి యాదవ్ మామిడి తోటలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఒకసారిగా మాటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గత నవంబర్‌లో నిర్వహించిన ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 3వ సెమిస్టర్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోరుకునే అభ్యర్థులు మార్చి 9లోపు రూ.1,860 చెల్లించాలని, పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ఆయన సూచించారు.
SKLM: ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం నరసన్నపేట మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ఈ మేరకు వారు ధర్నా నిర్వహించారు. సభ్యులు శ్రీధర్ రావు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ సమస్యలు తీర్చాలని అన్నారు.
VZM: వీటి అగ్రహారం ప్రభుత్వ ITI కళాశాలలోని నైపుణ్య కేంద్రం నందు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు 3 నెలలు శిక్షణ కొరకు ధరఖాస్తులు కోరడమైనదని ITI ప్రిన్సిపల్ టి.వి గిరి తెలిపారు.18 నుంచి 35 ఏళ్లలోపు ఉండి, ఇంటర్ చదివిన వారు అర్హులన్నారు. అభ్యర్ధులు మార్చి 5వ తేదీలోపు https://forms.gle/vkUYDKj9DZyaHY2T8 లింక్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏవో) పదోన్నతులు లభించాయి. జెడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, సీఈవో జ్యోతిబసు ఆధ్వర్యంలో వీరికి నియామక పత్రాలను శుక్రవారం అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో సురేష్ బాబు, పాండురంగ స్వామి, శ్రీనివాస మూర్తి, శ్రీనివాసరావు ఉన్నారు.
ATP: ఏపీ సైనిక సంక్షేమ డైరెక్టర్ క్యాప్టెన్ పి.సత్యప్రసాద్ శుక్రవారం అనంతపురంలో పర్యటించారు. మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు రామావత్ పార్వతి, దరపనేని శ్రావణిలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. వీరమరణం పొందిన జవాన్ నరేష్ సాకే కుటుంబాన్ని పరామర్శించి, ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం, భూమి కేటాయింపుపై హామీ ఇచ్చారు.
W.G: హైదరాబాద్ AIG లో చికిత్స పొందుతున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి శాసన సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజును ప్రఖ్యాత సినీ నటుడు మంచు మోహన్ బాబు శుక్రవారం ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. RRR త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రేపు డిశార్చ్ అవుతారని టీడీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) దూరవిద్య కేంద్రం 2026 క్యాలెండర్ సంవత్సరానికి గాను 5 ఎంబీఏ స్పెషలైజేషన్లకు యూజీసీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నుంచి అనుమతి పొందినట్లు సీడీఈ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. అలాగే, మార్చి 8న జరగాల్సిన ఎంబీఏ ప్రవేశ పరీక్షను మార్చి 15వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.
NDL: బీజేపీ యువమోర్చా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. విజయ భాస్కర్ శుక్రవారం ఎన్నికయ్యారు. 2014 నుంచి డోన్ పట్టణంలో విద్యార్థి హక్కుల కోసం ఉద్యమం చేశారు. యువత శక్తిని జాతీయ నిర్మాణంలో భాగం చేయడం, కేంద్ర సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన వెల్లడించారు.
NLR: కావలి మండలం పెద్ద రాముడు పాలెం గ్రామంలో కోడిపందాలు ఆడుతున్నారని సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9 మంది వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 32,350 రూపాయలు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నామని రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట, కోడిపందాలు, గంజాయి అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
TPT: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది డిసెంబర్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) మూడో(3వ) సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
కడప: జిల్లాలోని చేనేత సహకార సిల్క్, కాటన్ నిధులు కేటాయించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని చేనేత ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున స్పష్టం చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట శుక్రవారం చేనేత సహకార సంఘాలు,ప్రజా సంఘాల నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. సంఘాలను తిరిగి పునరుద్దించేలా RRR నిధులను విడుదల చేసేలా చూడాలన్నారు.
ELR: జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిని శుక్రవారం ఏలూరు ఎంపీ మహేష్ సందర్శించారు. పేషంట్ల వద్దకు వెళ్లి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించద్దని ఆసుపత్రికి కావలసిన వివిధ సేవల గురించి ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు.ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కర్నూలు: యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ ఎస్ఈ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. డి అంజిబాబు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కోటి రూపాయల ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సమాన వేతనం కల్పించాలని కోరారు.
ATP: జిల్లాలో మార్చి 3 నుంచి 5 వరకు ‘జనగణన-2027’ మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఏ. మలోల తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో సుమారు 200 మంది అధికారులకు ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇళ్ల జాబితా, గృహ గణన అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.