VZM: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఉదయం 11.10 గంటలకు రావివలస హెలిప్యాడ్‌కు చేరుకుని చీపురుపల్లి CHCలో HPV వాక్సిన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరవుతారు. పైలపేటలో NTR భరోసా పింఛన్లు పంపిణీ చేసి, మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరానికి తిరుగు ప్రయాణమవుతారు.
TPT: మద్యం మత్తులో జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. యువకుల మధ్య తలెత్తిన వివాదంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమలనగర్‌కు చెందిన యువకులు మద్యం మత్తులో గొడవపడ్డారు. దీంతో ఓ యువకుడు తన వద్ద ఉన్న కత్తితో తోటి వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానికులు క్షతగాత్రుడిని రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: మద్యం మత్తులో భార్యపై దాడి చేయడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాణినగర్ ప్రాంతంలో నిందితుడు మౌలా పోలీస్ రక్షక్ వాహనం అద్దాన్ని ధ్వంసం చేసి పరారయ్యాడు. పోలీసులు అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపరచగా, మార్చి 12 వరకు రిమాండ్ విధించారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు.
ప్రకాశం: దర్శిలో ఆదర్శ మోడల్ స్కూల్ ను శుక్రవారం కేంద్ర మానవ వనరుల శాఖ జాయింట్ సెక్రెటరీ ఘయాజుద్దీన్ అహ్మద్ సందర్శించారు. పిఎంశ్రీ పాఠశాలల తనిఖీలలో భాగంగా వచ్చారు. విద్యార్థులతో కొంత సమయం గడిపి వారి నుంచి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల సమాధానాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తరగతి గదులు, ల్యాబ్లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.
కృష్ణా: మచిలీపట్నం జైహింద్ హై స్కూల్ ఎదురుగల గాడి ఖానా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర 500 మంది పేదలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యంత పవిత్రంగా రంజాన్ ఉపవాసాలు, దీక్షలు ఆచరిస్తున్న ప్రతి ముస్లిం సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.
CTR: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని PKM-UDA ఛైర్మన్ డా.సురేశ్ పేర్కొన్నారు. రామకుప్పం (M) పరిధిలోని పెద్దతండా, కొత్తూరుతండా, చెలిమి చేను తండా గ్రామాలను TDP నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను ప్రజలు తెలపడంతో వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
NTR: ప్రతినెల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సమగ్రంగా ప్రతిబింబించేలా రూపొందించిన “విజన్ యాక్షన్ ప్లాన్ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ..సెంట్రల్ నియోజకవర్గాన్ని 2047 నాటికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నావని తెలిపారు.
SKLM: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వీబీ జీ రామ్‌జీ’ చట్టంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించనున్నట్లు డ్వామా పీడీ బీ. లవ రాజు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి ఆరు వారాల పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో ‘జన్ -సంవాద్’ పేరుతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
TPT: తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని వరదయ్యపాలెం–తడ రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. భారీ గుంతలు, దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Sri City కార్మికులు, బస్సులు ప్రయాణించడం కష్టమై ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. రెండో రోజైన శుక్రవారం రుక్మిణీ సమేత శ్రీకృష్ణావతారంలో తిరుమలేశుడు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా శ్రీవారిని ఆలయం నుంచి తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తూ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అర్చకులు స్వామివారికి హారతులిచ్చి ప్రదక్షిణ ప్రారంభించారు.
VZM: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎస్ కోటలో పట్టణ పార్టీ అధ్యక్షులు మోపాడ చిన్న ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు, సత్యనారాయణ పాల్గొన్నారు. గ్రామ గ్రామాన జనసేన పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పార్టీ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
NLR: గుడ్లూరు మండలంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధంగా ఉన్నట్లు ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. సాధ్యమైనంత వరకు శనివారం అందరికీ పెన్షన్లు పంపిణీ చేసేందుకు సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కౌన్సిలింగ్ హాల్‌లో శనివారం ప్రత్యేక బడ్జెట్ సమావేశం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ భవాని శుక్రవారం తెలిపారు. ఈ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. కావున మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సిబ్బంది తప్పక హాజరుకావాలని ఆమె పేర్కొన్నారు.
AKP: పాయకరావుపేట మండలం వెంకటనగరంలో మినీ జెట్టీ, కోల్డ్ స్టోరేజ్, ఫిష్ సెల్లింగ్ సెంటర్, డ్రై ఫిష్ ఫ్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేయాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. మత్స్యశాఖ అధికారిణి శృతి శుక్రవారం గ్రామంలో పర్యటించి మత్స్యకారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పంచాయతీ తీర్మానం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
కోనసీమ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రముఖ సినీ నటులు, రచయిత తనికెళ్ల భరణి సూచించారు. ఆలమూరు మండలం చెముడులంక స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలకు విద్యార్థులను దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.