• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మందుగుండు దుకాణాల్లో డీఎస్పీ తనిఖీలు

W.G: ఆకివీడులోని టపాసుల విక్రయశాలలను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఉండిలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. దుకాణాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 26, 2026 / 07:00 AM IST

సోలార్ రుణాల మంజూరులో వేగం పెంచాలి: కలెక్టర్

ELR: ‘పీఎం సూర్యఘర్ ముస్తీ బిజిలీ’ యోజన అమలులో అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేసి పురోగతి సాధించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న 600 రుణ దరఖాస్తులను 2 రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో 7,320 నివాసాల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు పూర్తయిందన్నారు.

February 26, 2026 / 07:00 AM IST

కొత్త అమావాస్య జాతరకు ఏర్పాట్లు

అనకాపల్లి పట్టణం తాకాశి వారి వీధిలో వేంచేసియున్న నూకంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ రాజేష్ తెలిపారు. మార్చి నెలలో జరిగే జాతరకు సంబంధించి బుధవారం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మూహుర్తపు రాట వేసారు. ప్రతి ఏటా అమ్మవారి జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

February 26, 2026 / 07:00 AM IST

కనిగిరి ప్రాంత నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఫైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా ఎనలిస్ట్ కోర్సుల్లో 3నెలలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. 17 నుంచి 30 సంవత్సరాలు వయసు గల ఇంటర్, డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. రిజిస్ట్రేషన్ కొరకు 80088 22821 ను సంప్రదించాలన్నారు.

February 26, 2026 / 06:47 AM IST

బీటీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో

కృష్ణా: పెడన మండలంలోని అచ్చయ్యవారిపాలెం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఎంపీడీవో అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు నాణ్యత ప్రమాణాలతో నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరు పంచాయతీ కార్యదర్శి జానకి పాల్గొన్నారు.

February 26, 2026 / 06:45 AM IST

కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై గళం

సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బుధవారం అసెంబ్లీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. రూ. 20 వేలలోపు వేతనం పొందుతున్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని కోరారు. గతంలో ఇచ్చిన క్రమబద్ధీకరణ హామీలను అమలు చేసి అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

February 26, 2026 / 06:45 AM IST

క్రీడోత్సవాల్లో సందడి చేసిన మంత్రి కందుల

E.G: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో బుధవారం “ఆంధ్రప్రదేశ్ ఆటవిడుపు – 2026” క్రీడోత్సవాలు ఘనంగా జరిగాయి. నిడదవోలు MLA కందుల దుర్గేశ్ ఈ పోటీల్లో పాల్గొని టగ్ ఆఫ్ వార్, రన్నింగ్, కబడ్డీ ఆడి అలరించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు జట్టు భావనను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకలో పలువురు MLAలు, MLCలు పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటారు.

February 26, 2026 / 06:45 AM IST

‘లైసెన్స్ కలిగిన షాపుల్లో మందులు కొనుగోలు చేయాలి’

NTR: విజయవాడలో నాణ్యమైన జనరిక్ మందుల ప్రోత్సాహకంపై ముద్రించిన అవగాహన పోస్టర్లను లక్ష్మీశ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు స్వయంగా మందులు తీసుకోవడం నివారించాలని సూచించారు. లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచి బిల్లులతో మందులు కొనుగోలు చేయాలని, గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించి, వైద్యుల సూచించిన విధంగా మందులు వాడాలన్నారు.

February 26, 2026 / 06:43 AM IST

నేడు పీఎం సూర్య ఘర్‌పై అవగాహన కార్యక్రమం

SKLM: సోంపేట మండల పరిషత్ కార్యాలయంలో పీఎం సూర్య ఘర్ పథకం (సోలార్ రూఫ్ టాప్)పై ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తు న్నట్లు పలాస ఈఈ యజ్ఞేశ్వర రావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో సోలార్ రూ ప్టాప్ పెట్టుకోవడం వలన కలుగు లాభాలు, రాయితీ, బ్యాంకు రుణాలపై అవగాహన కల్పిస్తామన్నారు.

February 26, 2026 / 06:40 AM IST

తామరకొల్లులో అగ్ని ప్రమాదం..

ELR: కైకలూరు మండలం తామరకొల్లు గ్రామంలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాడపాటి నాగరాజుకు చెందిన సుమారు మూడు ఎకరాల వరిగడ్డి అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న కైకలూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో రూ.40 వేల విలువైన గడ్డివాము నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపారు.

February 26, 2026 / 06:37 AM IST

దివ్యాంగ పారిశ్రామికవేత్తను అభినందించిన కలెక్టర్

NTR: కండ్రిగకు చెందిన దివ్యాంగ పారిశ్రామికవేత్త మల్లికార్జున నాయుడు ఆత్మవిశ్వాసం, పట్టుదలపై కలెక్టర్ లక్ష్మీశ బుధవారం ప్రశంసలు కురిపించారు. చిన్న స్టీల్ దుకాణాన్ని నిర్వహించేందుకు పొందిన రుణాన్ని పూర్తిగా చెల్లించి ఆదర్శంగా నిలిచారని ఆయనను అభినందించారు. ఉపాధి అవకాశాలను సృష్టించే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

February 26, 2026 / 06:36 AM IST

భూములను రీసర్వే నిర్వహించిన ఆర్డీవో

NLR: ఆత్మకూరు మండలం పమిడిపాడులో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను ఆత్మకూరు ఆర్డీవో బి.పావని బుధవారం పరిశీలించారు. రెవెన్యూ సిబ్బంది గ్రామంలోని 810 ఎకరాల భూముల హద్దులను నూతనంగా నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. ఇక్కడ జరుగుతున్న భూ రీసర్వే విధానాన్ని ఆర్డీఓ పరిశీలించి భూముల వివరాలు వాటి యజమానుల వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

February 26, 2026 / 06:36 AM IST

నేడు ప్రత్యేక విద్యుత్ అదాలత్

TPT: వాకాడు సబ్‌స్టేషన్ వద్ద ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఈఈ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఛైర్‌పర్సన్ వి.శ్రీనివాస ఆంజనేయ మూర్తి (రిటైర్డ్ జడ్జి) హాజరుకానున్నారు. వాకాడు, కోట, చెందోడు, చిట్టమూరు సెక్షన్ల వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలపై అధికారులకు రాతపూర్వక ఫిర్యాదులు అందిచవచ్చని సిబ్బంది తెలిపారు.

February 26, 2026 / 06:36 AM IST

టీడీపీ నాయకుడు సుబ్బారెడ్డి కన్నుమూత

E.G: అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మామ కొవ్వూరి సుబ్బారెడ్డి (76) తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయానికి MLA నివాళులర్పించారు. గతంలో కొంకుదురు గ్రామ సొసైటీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సుబ్బారెడ్డి.. వివాదరహితునిగా గుర్తింపు పొందారు. ఆయన మృతితో నియోజకవర్గంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

February 26, 2026 / 06:34 AM IST

టెన్త్ పరీక్షలకు 143 కేంద్రాలు ఏర్పాటు

ATP: జిల్లాలో మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పరీక్షల కోసం 143 కేంద్రాలను సిద్ధం చేశారు. 31,972 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆన్‌లైన్ విధానం ద్వారా 370 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులను నియమించింది. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 చేస్తామని అధికారులు తెలిపారు.

February 26, 2026 / 06:33 AM IST