కడపలో సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న హోళీ సంబరాల పోస్టర్‌ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం యర్రమరెడ్డిగారిపల్లెలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హోళీ పండుగ ఐక్యత, కరుణకు నిదర్శనమని, ప్రతి ఇంటిలో శాంతి-సంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు.
W.G: తాడేపల్లిగూడెంకు చెందిన అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుసులూరి శివరామకృష్ణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏలూరులో జరిగిన సంఘ సమావేశంలో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శివరామకృష్ణ ఆదివారం తెలిపారు. తనపై సంఘ సభ్యులు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంఘ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని ఆయన పేర్కొన్నారు.
NDL: శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఉగాది ఉత్సవాలపై దేవస్థానం ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు రెండో విడత సమన్వయ సమావేశం నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భారీగా తరలివచ్చే పాదయాత్ర భక్తులకు కల్పించాల్సిన వసతులు, తాగునీరు, భద్రతపై స్వచ్ఛంద సంస్థలతో చర్చించారు.
NLR: అల్లూరులో టీడీపీ నూతన కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభసభ్యుడు బీదా మస్తాన్ రావు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తదితరులు హాజరై మాట్లాడారు. అల్లూరు కేంద్రంగా టీడీపీ బలోపేతానికి కొత్త కార్యాలయం దోహదపడుతుందన్నారు.
KDP: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో కోర్టు ఉద్యోగి భక్తుల మధుసూదన్ రావు (47) మృతి చెందినట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహంరాజు తెలిపారు. CI వివరాలు.. సిద్ధవటం అటవీ చెక్‌పోస్ట్ సమీపంలో ఆదివారం సాయంత్రం సిద్ధపటం కోర్టు నందు లోక్ అదాలత్ సెక్షన్లో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ రావు బైకుపై బద్వేల్‌కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు.
SKLM: రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నుంచి ఆమదలవలస రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు సాగాలని కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
GNTR: పొన్నూరు మండలం వెల్లలూరు టీడీపీ అధ్యక్షుడు గణిపిశెట్టి రామకృష్ణ మాతృమూర్తి లక్ష్మీ పద్మావతి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఫోన్‌లో గణిపిశెట్టి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్థివదేహానికి నివాళులర్పించారు.
ELR: కోకో గింజలు కొనుగోలు కంపెనీలు ధర తగ్గించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరల పాలసీ ప్రకటించాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆదివారం డిమాండ్ చేశారు. కోకో గింజల ధరల పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 9న సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.
ATP: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. 5వ తరగతి పరీక్షకు 6,457 మంది, జనరల్ ఇంటర్‌కు 3,528 మంది, ఐఐటీ/నీట్ పరీక్షకు 2,374 మంది విద్యార్థులు హాజరయ్యారని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి కె.జయలక్ష్మి తెలిపారు.
VZM: మహిళలు తమ హక్కులు బాధ్యతలు తెలుసుకోవాలని గజపతినగరం సీఐ జిఏవి రమణ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆర్టీసీ కాంప్లెక్స్ సవరణలో మహిళలకు అవగాహన సదస్సు పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన తమ శాఖ రక్షణగా ఉంటుందన్నారు.
KKD: గ్రామంలోని చెరువు పరిసరాల్లో యువకులు సాయంత్రం వేళ క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. వర్షాల కారణంగా చెరువులో నీరు నిల్వ ఉండగా, చుట్టూ పచ్చదనం అలరారుతోంది. ప్రకృతి మధ్య ఆటలతో కాలక్షేపం చేస్తున్న యువత ఆనందం వ్యక్తం చేశారు. అయితే చెరువు వద్ద రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశముందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
PPM: అంగన్వాడీ యూనియన్ నాయకుల హౌస్ అరెస్టులను సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి ఖండించారు. ఆదివారం కొమరాడలో ఆయన మాట్లాడుతూ.. విజయవాడ మహా ధర్నాకు వెళ్తున్న నాయకులను నిర్బంధించడం అన్యాయమన్నారు. ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
VZM: RTCలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ఔట్సోర్సింగ్ కార్మికులు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో 7300 మంది కార్మికులు ఉన్న థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి, నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్ట్రీట్ పబ్లిక్ సెక్రెటరీ అశోక్ కోర...
ASR: మహిళలు ఎక్కడయితే గౌరవించబడతారో అక్కడ సమాజం అభివృద్ధి చెందుతుందని చింతపల్లి ఎస్సైలు వీరబాబు, వెంకటరమణ అన్నారు. మహిళలు సమాజానికి మూల స్తంభాలన్నారు. ఆదివారం చింతపల్లిలో విద్యార్థులతో మహిళల భద్రతపై ర్యాలీ నిర్వహించారు. దేశంలో మహిళా రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.
VSP: శివాజీ, లయ జంటగా నటించిన “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని” చిత్రం ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర విశేషాలను యూనిట్ వెల్లడించింది. ఇదొక విభిన్నమైన డార్క్ కామెడీ చిత్రమని, ముఖ్యంగా చివరి 45 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని హీరో శివాజీ ధీమా వ్యక్తం చేశారు.