• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రైల్వే ప్రయాణికులకు.. హోలీ పండగకు ప్రత్యేక రైలు

TPT: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సహా భారతీయ రైల్వేలు పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించాయి. మార్చి 1, 2, 3, 5, 9, 12 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

March 1, 2026 / 09:13 AM IST

అప్పనపల్లిలో మహిళ ఆత్మహత్య

అన్నమయ్య: రుద్రవరం మండలం అప్పనపల్లిలో నివాసం ఉంటున్న పల్లె శివలక్ష్మి (30) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జయప్ప శనివారం తెలిపారు. భర్త మద్యానికి బానిసయ్ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

March 1, 2026 / 09:13 AM IST

రాత్రివేళల్లో జోరుగా మట్టి తవ్వకాలు

ప్రకాశం: మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామ పరిసర ప్రాంతాల్లో రాత్రివేళల్లో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా జోరుగా సాగుతున్నాయి. అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో కొందరు కూటమి నాయకులు జేసీబీలు వినియోగించి ట్రాక్టర్ల ద్వారా మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు దృష్టి సాధించాలని ప్రజలు కోరుతున్నారు.

March 1, 2026 / 09:12 AM IST

కొబ్బరి చెట్టుపై నుంచి పడి వ్యక్తికి తీవ్రగాయాలు

అన్నమయ్య: బీ కొత్తకోట మండలం నామాలపల్లిలో శనివారం కొబ్బరి బోండాలు దింపుతుండగా కాలు జారి కొబ్బరి చెట్టుపై నుంచి పడి కుళ్లాయప్ప అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు అతన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో వైద్యులు తిరుపతికి తరలించాలని సూచించారు.

March 1, 2026 / 09:12 AM IST

జిల్లాలో APTF ఆధ్వర్యంలో ధర్నా..!

WG: భీమవరంలో శనివారం APTF ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మార్చి 3న ఏలూరులో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని గౌరవ అధ్యక్షురాలు బి. పుణ్యవతి, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.శ్రీవల్లి, కె.జాన్ మోజెస్ పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

March 1, 2026 / 09:11 AM IST

‘రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలి’

గుంటూరు నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు నగర కమిషనర్ కె. మయూర్ ప్రజారోగ్య అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. రోడ్లు, డ్రైన్లలో వ్యర్థాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి వంద శాతం తడి, పొడి చెత్త సేకరించాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు కమిషనర్ సూచించారు.

March 1, 2026 / 09:10 AM IST

శ్రీశైలంలో నేడే కామదహనం

NDL: శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు కామదహనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన ఆలయం ముందు గంగాధర మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం సంప్రదాయం ప్రకారం మన్మథ రూపాన్ని దహనం చేస్తారని వివరించారు.

March 1, 2026 / 09:05 AM IST

నేడు జిల్లాలో మాంసం ధరలు ఎంతంటే..?

నెల్లూరు జిల్లాలో ఈ ఆదివారం చికెన్, మటన్ ధరలు ముందు వారంతో పోలిస్తే కాస్త పెరిగాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీ స్కిన్తో కూడిన చికెన్ రూ. 270, స్కిన్లెస్ చికెన్ రూ. 300, నాటుకోడి మాంసం కేజీ రూ. 700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వారు పేర్కొన్నారు.

March 1, 2026 / 09:02 AM IST

అంబటి రాంబాబుకు కల్యాణదుర్గం పోలీసుల నోటీసులు

ATP: CM చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కల్యాణదుర్గం పోలీసులు నోటీసులు ఇచ్చారు. కల్యాణదుర్గంలో నమోదైన ఈ కేసు విషయమై గుంటూరు సిద్ధార్థనగర్‌లోని అంబటి కార్యాలయానికి కానిస్టేబుల్ వచ్చి నోటీసులు అందజేశారు. విచారణకు సహకరించాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

March 1, 2026 / 09:00 AM IST

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలో ఉపాధి హామీ పని దినాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నుంచి ప్రతిరోజూ లక్ష పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఏడాది 19,508 కుటుంబాలు వంద రోజుల పని పూర్తి చేసుకోగా, ఈసారి ఆ సంఖ్యను పెంచాలని అన్నారు.

March 1, 2026 / 09:00 AM IST

నిడదవోలు ఎంపీడీవోగా జగన్నాథరావు

E.G: నిడదవోలు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సాయంత్రం జగన్నాథరావు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశమై మండల అభివృద్ధి పనులపై సమీక్షించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

March 1, 2026 / 09:00 AM IST

రాజోలు బాణసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు

కోనసీమ: రాజోలు మండలం పొన్నమండలోని బాణసంచా తయారీ కేంద్రాల్లో శనివారం సాయంత్రం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తహసీల్దార్ భాస్కర్ నేతృత్వంలో పోలీస్, ఫైర్ సిబ్బంది నిబంధనల అమలును పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలు పాటించాలని పలు సూచనలు చేశారు.

March 1, 2026 / 09:00 AM IST

ఎస్సీ కార్పొరేషన్ కాంప్లెక్స్‌కు మరమ్మతులు

విజయనగరం: కొత్తవలస కూడలికి అనుకోని ఉన్న ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన కాంప్లెక్స్ మరమ్మతులకు గురవ్వడంతో ఆ శాఖకు చెందిన అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొత్తం తొమ్మిది షాపులు ఉండగా, మూడు షాపులు శిథిలాస్థితికి చేరుకోవడంతో మరమ్మతులు కోసం రూ 7.15 లక్షల నిధులతో మొత్తం షాపులు అందుబాటులోకి తీసుకువస్తామని సీనియర్ అసిస్టెంట్ ఎస్.సత్యనారాయణ చెప్పారు.

March 1, 2026 / 08:54 AM IST

ఉచిత ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

అన్నమయ్య: ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజంపేట MEO-1,2 రఘునాథరాజు,సుబ్బరాయుడు తెలిపారు. ప్రైవేట్‌లో ఉచితంగా ఒకటో తరగతి చేరితే ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది అని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల వివరాలను సమీప పంచాయతీ వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.

March 1, 2026 / 08:39 AM IST

ఆది ఆంధ్రవాడలో పోలీసుల పల్లె నిద్ర

CTR: SR పురం మండలం, ఏయంపురం ఆది ఆంధ్రవాడ గ్రామంలో ఎస్సై సుమన్ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో గంజాయి అమ్మిన, తాగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాటు సారా, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.

March 1, 2026 / 08:39 AM IST