• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ఇచ్చిన హామీలను అమలు చేయాలి’

ELR: కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని IFTU ఉమ్మడి ప.గో.జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. పెదవేగి మండలం కూచింపూడిలో ఆదివారం జరిగిన ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ బోర్డులోని పథకాలను మరింత పెంచి, అర్హులైన కార్మికులందరికీ వర్తింపజేయాలన్నారు.

March 1, 2026 / 05:02 PM IST

‘అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

CTR: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వేతనాల పెంపు, ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపు, 5G స్మార్ట్‌ఫోన్ల పంపిణీ, గ్రాట్యుటీ కోసం రూ.20 కోట్లు కేటాయింపు వంటి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

March 1, 2026 / 05:00 PM IST

చాగలమర్రిలో ఎన్ఆర్ఈజీఎస్ రోడ్ల ప్రారంభం

NDL: చాగలమర్రి మండలం NREGS మొదటి విడత కింద నిర్మించిన నాలుగు CC రోడ్లను MLA అఖిలప్రియ ఇవాళ ప్రారంభించారు. మొదటి విడతకు రూ.2.50 కోట్లు, రెండో విడతకు రూ.2.02 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మండలంలో రోడ్లు, డ్రైనేజీల కొరత లేకుండా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల హామీల మేరకు ఆళ్లగడ్డ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.

March 1, 2026 / 05:00 PM IST

టీడీపీలోకి చేరిన 80 కుటుంబాలు

సత్యసాయి: గోరంట్ల మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 80 కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. నార్సింపల్లి పంచాయతీ ఎర్రపల్లికి చెందిన వైసీపీ నాయకుడు పద్మనాభం రెడ్డి, ఎంపీటీసీ తిప్పమ్మతో పాటు మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సవిత వారందరికీ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

March 1, 2026 / 04:56 PM IST

ఈ నెల 3న అమ్మవారి ఆలయం మూసివేత

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని 216 జాతీయ రహదారికి సమీపంలో ఉన్న బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ సమయం అనంతరం ఆలయం తిరిగి తెరుచుకుంటుందని, భక్తులు అవగాహనతో సహకరించాలని కోరారు.

March 1, 2026 / 04:56 PM IST

నాటుసార స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు

ATP: నార్పల మండలం జంగం రెడ్డి పల్లె గ్రామ సమీపంలో ఆదివారం నాటు సారా స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఎస్సై సాగర్ మాట్లాడుతూ.. నాటు సారా తయారు చేస్తున్నారని సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించమన్నారు. అందులో భాగంగా 300 లీటర్ల నాటు సారా బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. నాటు సారా తయారుచేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 1, 2026 / 04:53 PM IST

సబ్ డివిజనల్ పరిధిలో సెక్షన్-30 అమలు

కోనసీమ: రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో మార్చి 31 వరకు సెక్షన్-30 అమలులో ఉంటుందని ఇంఛార్జ్ డీఎస్పీ టీఎస్ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రామచంద్రపురం, ద్రాక్షారామం, పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఆయన హెచ్చరించారు. ముందస్తు అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు.

March 1, 2026 / 04:49 PM IST

రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

KRNL: పెద్దకడుబూరులో రౌడీషీట్ కలిగిన వ్యక్తులకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ నిరంజన్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలని, గొడవలు చేయకుండా చట్టాలను గౌరవించాలని సూచించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని, ఏవైనా వివాదాలు ఉంటే చట్టబద్ధ మార్గాల్లో పరిష్కరించుకోవాలని హెచ్చరించారు.

March 1, 2026 / 04:47 PM IST

గిట్టుబాటు ధర లేక టమాటా రైతుల విలవిల

ATP: టమాటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం అనంతపురంలో కిలో టమాటా రూ. 7 మాత్రమే పలుకుతోంది. కోత ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. దీంతో పండిన పంట పశువుల పాలవుతున్నాయి. ఆదాయం లేక సాగుపై మక్కువ తగ్గుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 1, 2026 / 04:46 PM IST

బాణసంచా తయారీ కేంద్రాలపై తనిఖీలు

AKP: జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘటన జరిగిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు తనిఖీలు చేపట్టిందన్నారు. నర్సీపట్నం, పరవాడ డీఎస్పీల ఆధ్వర్యంలో రెవెన్యూ, ఫైర్, పోలీస్ శాఖలు సంయుక్తంగా అనధికారంగా నిర్వహిస్తున్న కేంద్రాలపై దాడులు చేస్తున్నామన్నారు.

March 1, 2026 / 04:42 PM IST

కొత్తపేటలో శ్రీ పెద్దపల్లి గంగమ్మ షికారి ఉత్సవం

CTR: కుప్పం పట్టణం కొత్తపేటలో శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారి షికారి ఉత్సవం ఆదివారం నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణ పురవీధుల్లో కోలాహలంగా ఊరేగించారు. ఉత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి జాతరకు భారీగా ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ధర్మకర్త శివకుమార్ తెలిపారు.

March 1, 2026 / 04:39 PM IST

ఉమ్మడి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం

KRNL: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామీణ నీటి సరఫరా, విద్యా శాఖ, ప్రజా పంపిణీ వ్యవస్థ, 2026-27 అంచనా బడ్జెట్‌పై సమగ్ర చర్చలు జరిపారు. జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

March 1, 2026 / 04:37 PM IST

పిడుగురాళ్ల రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి

PLD: పిడుగురాళ్లలోని పిల్లుట్ల రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సున్నంబట్టీల వద్ద గుర్తుతెలియని వాహనం అటుగా వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో, అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 1, 2026 / 04:30 PM IST

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్

BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ఆదివారం పర్చూరు పోలీసులు జూద స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది జూదగాళ్లను పట్టుకుని, వారి నుంచి రూ.6,060 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా ఇటువంటి పనులకు పాల్పడుతుంటే వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

March 1, 2026 / 04:30 PM IST

తుళ్లూరు, తాడికొండలో బీసీ కమ్యూనిటీ హాల్స్ ప్రారంభం

GNTR: దాతల సహాయంతో తుళ్లూరు మండలం పెద పరిమి మరియు తాడికొండ మండలం రావెల గ్రామాల్లో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్స్‌ను కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం, దాతలు సూద్న్ గుంట రాఘవేంద్రప్రసాద్, కల్యాణికు సన్మానం చేశారు.

March 1, 2026 / 04:30 PM IST