కృష్ణా: ఘంటసాల మండలం పూషడం నుంచి మల్లాయి చిట్టూరు ప్రధాన రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధి పథకం నిధులతో నూతన రోడ్డు నిర్మాణం చేపట్టారు. జరుగుతున్న పనులను పంచాయతీరాజ్ శాఖ డీఈఈ పగడాల సురేష్, సర్పంచ్ ఆవుల రేవతి, టీసీ అధ్యక్షులు నరసయ్య పరిశీలించారు.
ప్రకాశం: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించాలనే లక్ష్యంతో పొన్నలూరులో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పోలీస్ అధికారులు సిబ్బందిని నియమించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామన్నారు.
అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు మంగళవారం అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష సమయాల్లో కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి రూరల్ నూతన ఎంపీడీవోగా మస్తాన్ వలి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. మస్తాన్ వలి మాట్లాడుతూ.. మండల అభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా పనిచేస్తానన్నారు.
చిత్తూరు: పుంగనూరు పట్టణంలోని శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారి మూలవర్లను పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత పసుపు, కుంకుమ, కాటుకతో అమ్మవారిని నిజరూపంలో అలంకరించారు.
ELR: గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో శ్రీ పార్వతి సమేత రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ధ్వజస్తంభం పునః ప్రతిష్ట సందర్భంగా మంగళవారం క్రొవ్విడి వంశీలు ఆధ్వర్యంలో పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోనసీమ: రాజోలు నియోజకవర్గం వైసీపీ పార్టీ కొత్త కో ఆర్డినేటర్‌ను నియమించనున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత కో ఆర్డినేటర్ గా ఉన్న గొల్లపల్లి సూర్యారావు అనారోగ్యం కారణంగా తీసుకుంటున్న సందర్భంలో ఈ మార్పు అనివార్యమైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తుందని అంటున్నారు.
చిత్తూరు: పలమనేరులో వెంకట్రావు అనే వ్యక్తి సుమారు రూ.14 కోట్లకు ఐపీ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయమై బాధితులు అంతా కలిసి పలమనేరు సీఐ మోహన్ రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సీఐ ఇలాంటి అనధికారిక చీటీలు వేయవద్దని ప్రజలకు సూచించారు.
CTR: పుంగనూరులోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు MPDO అప్పాజీ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నీటి సమస్య రాకుండా రూ.25 లక్షలతో వివిధ గ్రామాల్లో బోర్లు వేస్తున్నట్లు చెప్పారు. మండల పరిధిలో 624 బోర్లు ఉన్నాయని అన్ని పనిచేస్తున్నాయన్నారు. నీటి సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సలహాదారులు రత్నం విచ్చేశారు. దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ స్వయంగా వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రం ఆయనకు అందజేశారు.
W.G: ప్రశాంతతకు మారుపేరైన జిల్లాలో వరుస అవినీతి ఘటనలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అధికారులు ACBకి చిక్కడం సంచలనంగా మారింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పట్టుబడిన 48 గంటల్లోనే, భీమవరంలో అటవీశాఖ అధికారి లంచం తీసుకుంటూ దొరకడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
VZM: విద్యార్థులు మంచి ఉపన్యాసకులుగా తయారు కావాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి డా. మిరియాల కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం వక్త పోటీలను నిర్వహించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు.
KDP: తెల్లవారుజామున ఎర్రగుంట్ల సీఐ కె.విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది మెరుపు తనిఖీలు నిర్వహించారు. వీధుల్లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఇళ్లను సోదాలు చేశారు. ఎలాంటి రికార్డు లేని 12 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ కాలనీ వాసులతో సమావేశం నిర్వహించి ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరించారు.
SKLM: కాశీబుగ్గ రైల్వే గేట్ సమీపంలో ఉన్న శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి వేళ చోరీ జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు గర్భగుడిలోకి ప్రవేశించి తూలంపావు బంగారు ఆభరణాలు చోరీ చేశారని ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో 2వ రోజుకూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్లోని రికార్డులను, పలు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిన్న సింహాద్రిపురం ఎస్సై అనిల్ కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. మంగళవారం ఏసీబీ అధికారులు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను విచారిస్తున్నట్లు సమాచారం.