• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎస్. కొత్తూరులో పర్యటించిన జాయింట్ కమిషనర్

NDL: పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో ఇవాళ దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ పర్యటించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చంద్రశేఖర్ ఆజాద్ చేరుకోగానే ఆలయ అధికారులు అర్చకులు కలిసి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

February 21, 2026 / 06:32 PM IST

నరసాపురం మండలంలో ఐదుగురు అరెస్ట్

W.G: నరసాపురం మండలం సరిపల్లి శివారులో శనివారం పోలీసులు జరిపిన దాడిలో ఐదుగురు పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 8,760 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై టి. వెంకట సురేశ్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జూదం ఆడుతూ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

February 21, 2026 / 06:31 PM IST

ఆలూరులో AITUC జిల్లా మహాసభల పిలుపు

KRNL: AITUC 21వ జిల్లా మహాసభలు ఆలూరులో మార్చి 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి ఎస్. మునెప్ప శనివారం తెలిపారు. ఈ మహాసభలకు కార్మిక లోకం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మిగనూరులోని సీపీఐ కార్యాలయం ముందు మహాసభల కరపత్రాలను విడుదల చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.

February 21, 2026 / 06:30 PM IST

ఆదివారం పన్ను చెల్లింపు కేంద్రాలు పని చేస్తాయి: కమిషనర్

GNTR: ఆస్తి పన్ను, బకాయిలు చెల్లించడానికి ఆదివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్ను చెల్లింపు కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 వరకు యధావిధిగా పనిచేస్తాయని GMC కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

February 21, 2026 / 06:28 PM IST

చీపురుపల్లిలో పర్యటించిన మాజీ ఎంపీ బెల్లాన

VZM: చీపురుపల్లి పట్టణంలోని పిల్లపేటలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శనివారం పర్యటించారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వైసీపీ గ్రామ, అనుబంధ కమిటీల నియామకంపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కమిటీలు అత్యంత కీలకమని, వార్డుల వారీగా బాధ్యతగా పనిచేసి కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కష్టపడిన వారికి కమిటీల్లో చోటు కల్పించాలన్నారు.

February 21, 2026 / 06:26 PM IST

ప్రభుత్వానికి ఉద్యోగులే వెన్నెముక: ఎమ్మెల్యే

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని MLA పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. శనివారం సత్యసాయి జిల్లా ఎన్జీవో సంఘం నాయకులు ఎమ్మెల్యేను, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎన్జీవో భవన నిర్మాణానికి సహకరించాలని వారు కోరారు. CM దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

February 21, 2026 / 06:20 PM IST

చీపురి పట్టిన ఎమ్మెల్యే పరిటాల సునీత

ATP: రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆమె స్వయంగా చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి ఆసుపత్రిలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీపురుపట్టి పరిసరాలు శుభ్రం చేశారు.

February 21, 2026 / 06:20 PM IST

వైసీపీ దేవరపల్లి మండల ఉపాధ్యక్షుడిగా దుర్గారావు

E.G: దేవరపల్లి మండల వైసీపీ ఉపాధ్యక్షుడిగా దేవరపల్లి గ్రామానికి చెందిన దుర్గారావు నేడు నియమితులయ్యారు. వైసీపీ పార్టీలో మొదటి నుంచి కష్టపడే నాయకుడిగా పేరు ఉన్న దుర్గారావుకు ఈ పదవి దక్కడం పట్ల దేవరపల్లి పట్టణ అధ్యక్షుడు గంగాధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పదవి రావడానికి కారకులైన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 06:20 PM IST

ఎమ్మెల్యేను కలసిన బైరెడ్డిపల్లి ఎంపీడివో ఉపేంద్ర

CTR: పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని బైరెడ్డిపల్లి ఎంపీడివో ఉపేంద్ర శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అకౌంట్స్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తూ ప్రమోషన్ పై బైరెడ్డిపల్లి ఎంపీడివోగా ఇక్కడికి వచ్చారు. విధుల్లో చేరిన అనంతరం అసెంబ్లీ సమావేశాల నుంచి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆయన కార్యాలయంలో కలసి సన్మానించారు.

February 21, 2026 / 06:06 PM IST

‘వెంకటేశ్వర స్వామి ఫోటోలు రాజకీయ ప్రదర్శన చేయడం తగదు’

ELR: ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను రాజకీయ ప్రదర్శనలకు వినియోగించడం అత్యంత నీచమైన పని అని ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు అన్నారు. శనివారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడి, తీవ్రంగా ఖండించారు. 

February 21, 2026 / 06:05 PM IST

జీరో వేస్ట్‌పై కేజీహెచ్‌లో అవగాహన ర్యాలీ

VSP: కేజీహెచ్‌లో ‘జీరో వేస్ట్–లిటిల్ గవర్నెన్స్’ థీమ్‌పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఐ. వాణి ఆధ్వర్యంలో డాక్టర్లు, నర్సులు, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది ర్యాలీ చేపట్టారు. పాల్గొన్న వారితో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

February 21, 2026 / 06:05 PM IST

గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

VZM : గంజాయి రవాణకు పాల్పడినా, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతోపాటు, చెక్ పోస్టులను బలోపేతం చేసామని తెలిపారు. గంజాయి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే 1972కు సమాచారం అందించాలన్నారు.

February 21, 2026 / 06:04 PM IST

వైసీపీ జిల్లా SM కార్యదర్శిగా పెదపాటి చిన్నబాబు

E.G: వైసీపీ జిల్లా సోషల్ మీడియా కార్యదర్శిగా పెదపాటి చిన్నబాబును నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. గోపాలపురం నియోజకవర్గంలోకి చెందిన చిన్నబాబు, పార్టీ పథకాలు, కార్యాచరణను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తానేటి వనితకు కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 06:02 PM IST

‘భూ తాగాదాలకు పరిష్కారం-రాజీ మార్గమే’

PPM: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, దానికి కఠిన శిక్షలు తప్పవని లోక్ అదాలత్ సభ్యులు మరియు సీనియర్ న్యాయవాది టీ. జోగారావు అన్నారు. శనివారం గరుగుబిల్లిలో పార్వతీపురం మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా జోగారావు మాట్లాడుతూ.. భూతగాదాలు సమాజ శాంతి భద్రతపై ప్రభావం చూపుతాయని అన్నారు.

February 21, 2026 / 06:02 PM IST

క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధికి రూ. లక్ష విరాళం

AKP: ఎస్ రాయవరం మండలం రేవు పోలవరంలో యువత కోసం క్రికెట్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. దీని అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన వాసుపల్లి అడవిరాజు రూ. లక్ష విరాళాన్ని ప్రకటించారు. శనివారం చెక్కును రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా గ్రామ యువతకు అందజేశారు. క్రీడలను ప్రోత్సహించడానికి దాతలు ముందుకు రావాలని హోం మంత్రి పిలుపునిచ్చారు.

February 21, 2026 / 06:02 PM IST