• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అమ్మవారి జాతర చాటింపు కార్యక్రమం ప్రారంభం

అనకాపల్లి పట్టణ గవరపేట నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా ఘటాల ఊరేగింపు, జాతర చాటింపు సోమవారం ప్రారంభమైంది. అమ్మవారి జాతర ఈనెల 17, 18 తేదీల్లో జరుగగుతుందని ఆలయ ఛైర్మన్ నాగశ్రీను తెలిపారు. జాతరకు ఏర్పాట్లను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం సమన్వయకర్త పీలా గోవిందు, జనసేన ఇంఛార్జ్ భీమరశెట్టి రాంకి పాల్గొన్నారు.

March 3, 2026 / 06:32 AM IST

గ్రహణం వేళ.. నేడు పోలవరంలో ఆలయాల మూసివేత

ELR: సంపూర్ణ చంద్రగ్రహణం దృష్ట్యా పోలవరం మండలంలోని ప్రధాన ఆలయాలు మంగళవారం ఉదయం 10 గంటలకు మూతపడనున్నాయి. భక్తాంజనేయస్వామి, నగరేశ్వర-వాసవీ కన్యకాపరమేశ్వరీ, పట్టిసీమ సుదర్శన వేంకటేశ్వరస్వామి, వీరేశ్వరస్వామి ఆలయాల్లో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయాలను పునఃప్రారంభిస్తామని అన్నారు.

March 3, 2026 / 06:28 AM IST

నేడు జిల్లాలో మూతపడనున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు

SKLM: చంద్రగ్రహణం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలు మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మం, శ్రీముఖ లింగేశ్వర క్షేత్రం, ఎండల మల్లికార్జునస్వామి శైవక్షేత్రం మూసి వేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

March 3, 2026 / 06:24 AM IST

నేడు అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయం మూసివేత

CTR: తవణంపల్లె మండలంలోని శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయంను చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఈవో మునిశేఖర్, ఛైర్మన్ రఘుపతి తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూసి, రాత్రి 8 గంటలకు తిరిగి తెరిచి, 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.

March 3, 2026 / 06:21 AM IST

నేడు ఆలయం మూసివేత

CTR: తవణంపల్లె మండలంలోని శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయంను చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఈవో మునిశేఖర్, ఛైర్మన్ రఘుపతి తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ తలుపులు మూసి, రాత్రి 8 గంటలకు తిరిగి తెరిచి, 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.

March 3, 2026 / 06:21 AM IST

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధే లక్ష్యం: ఐటీడీఏ పీవో

ASR: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీడీఏ పీవో శ్రీపూజ అన్నారు. నిన్న ఐటీడీఏలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. స్వయం ఉపాధి రుణాలతో గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు.

March 3, 2026 / 06:19 AM IST

మనస్తాపానికి గురై ఆత్మహత్య

KRNL: ఆదోని మండలం కడితోట గ్రామానికి చెందిన శ్రీకాంత్ (20) అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దతుంబలం SI విద్యాశ్రీ తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 06:16 AM IST

భోగాపురం ఎయిర్ పోర్టు ప‌నులపై ఎంపీ ఫోకస్

VSP: విశాఖ భవిష్యత్తుకు కీలకంగా మారుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ ప్రత్యేక దృష్టి సారించారు. విమానాశ్రయం నిర్మాణంతో పాటు అక్కడికి చేరుకునే అనుసంధాన రహదారుల అభివృద్ధిపైనా సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల అధికారులతో సమావేశమైన ఆయన, రహదారి పనులు గడువులోగా పూర్తి కావాలని ఆదేశించారు.

March 3, 2026 / 06:16 AM IST

హత్య కేసులో ఐదుగురు అరెస్ట్ : CI

KDP: ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామంలో గతనెల 27న జరిగిన లారీ డ్రైవర్ షేక్ మొహమ్మద్ హత్య కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల బాకీ విషయమై జరిగిన గొడవలో దాడి చేయడంతో గాయపడిన మొహమ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణ్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

March 3, 2026 / 06:15 AM IST

జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎంపీ

KKD: జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు గుర్తింపు, గౌరవంతో పాటు బీమా రక్షణ కూడా అందిస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ఎంపీ ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. పార్టీ సభ్యత్వాలలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని, పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.

March 3, 2026 / 06:14 AM IST

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

కోనసీమ: పేద, మధ్యతరగతి వర్గాల్లో అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించని వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం అమలాపురంలో తన కార్యాలయం వద్ద 17 మందికి మంజూరైన రూ.19.92 లక్షల విలువైన చెక్కులు అందజేశారు.

March 3, 2026 / 06:12 AM IST

ఘనంగా మహారాజ కళాశాల వ్యవస్దాపక వేడుకలు

VZM: స్దానిక మహారాజా స్వయం ప్రతిపత్తి కళాశాలలో సోమవారం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్‌ సుదర్శనరావు మాట్లాడుతూ.. 1879లో స్థాపించిన ఈ చారిత్రక సంస్థ దేశంలోనే రెండో పురాతన కళాశాల అని కొనియాడారు. అనంతరం కళాశాల టాపర్‌గా నిలిచిన అఖిలకు బంగారు పతకం, 45 మంది విద్యార్థులకు రూ. 2 లక్షల స్కాలర్‌షిప్‌లను అందజేశారు.

March 3, 2026 / 06:10 AM IST

‘లక్ష్యాన్ని సాధించేందుకు సమిష్టిగా పనిచేయాలి’

WG: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని సాధించేందుకు జనసైనికులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పిలుపునిచ్చారు. భీమవరంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం పార్టీ నాయకులతో కలిసి ‘క్రియాశీలక సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సభ్యత్వం కార్యకర్తల కుటుంబాలకు భరోసా, రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు.

March 3, 2026 / 06:08 AM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి

GNTR: తెనాలి పట్టణ తెలుగు యువత ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

March 3, 2026 / 06:05 AM IST

రాహుల్ గాంధీని కలిసిన జిల్లా కాంగ్రెస్ నేత

అనంతపురం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఎండీ.ఇమామ్ వికారాబాద్‌లో పది రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఇమామ్‌కు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ఏపీలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, ప్రజలతో మమేకం కావాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు.

March 3, 2026 / 06:03 AM IST