• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో వైభవంగా రథారోహణ

GNTR: మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ‘రథారోహణ’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉత్సవ మూర్తులను దివ్య రథంపై ప్రతిష్ఠించగానే, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాకతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో, కోలాహలంగా మారాయి. భక్తుల గోవింద నామస్మరణ స్మరించుకున్నారు.

March 3, 2026 / 09:00 AM IST

గిద్దలూరులోని ఓ హోటల్లో దొంగతనం

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని వైఎస్ఆర్ సెంటర్లో ఉన్న పుల్లయ్య హోటల్లో సోమవారం అర్ధరాత్రి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. హోటల్లోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్, మానిటర్‌తో పాటు సుమారు రూ.10 వేల నగదును అపహరించినట్లు హోటల్ యజమాని తెలిపారు. మంగళవారం ఉదయం హోటల్ తెరవడానికి వచ్చిన యజమాని దొంగతనాన్ని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

March 3, 2026 / 09:00 AM IST

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కన్వినర్‌గా నల్లమిల్లి

E.G: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “SIR” ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కోసం రాష్ట్ర కన్వీనర్‌గా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ అధ్యక్షతన ఢిల్లీలోని బీజేపీ నేషనల్ ఆఫీస్‌లో ఈ నెల 7వ తేదీన జరిగే సమావేశానికి హాజరవుతారు.

March 3, 2026 / 08:49 AM IST

అల్లూరులో హోలీ సంబరాలు..!

NLR: చిన్నపిల్లలందరికీ ఎంతో ఇష్టమైన హోలీ పండుగ ప్రతి సంవత్సరం మార్చి నెలలో వస్తుంది. పిల్లలందరూ ఎంత ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి హోలీ పండుగ చిన్నపిల్లలతో ప్రారంభమైంది. పిల్లలందరూ రంగులు పూసుకుంటూ, బాగా ఆనందోత్సవాల నడుమ ఈ పండుగను జరుపుకుంటున్నారు. అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో హోలీ పండుగ ఘనంగా జరిగింది.

March 3, 2026 / 08:47 AM IST

నేడు నత్త రామేశ్వర స్వామి ఆలయం మూసివేత

W.G: చంద్రగ్రహణం కారణంగా పెనుమంట్ర శ్రీ నత్త రామేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మూసివేస్తున్నట్లు ఈవో పులగం వేణుగోపాలరావు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేస్తామన్నారు. తిరిగి బుధవారం సంప్రోక్షణ పనులు పూర్తి చేసిన అనంతరం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.

March 3, 2026 / 08:45 AM IST

‘వికసిత్ భారత్-జీ రామ్ జీ’ పోస్టర్ల ఆవిష్కరణ

అనంతపురం కలెక్టరేట్‌లో ‘వికసిత్ భారత్-జీ రామ్ జీ’ పోస్టర్లను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి, జీవనోపాధి కోసం 125 రోజుల పని దినాల హామీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆరు వారాల ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.

March 3, 2026 / 08:42 AM IST

రుషికొండ బీచ్ రోడ్డులో బస్సు దగ్ధం

VSP: జిల్లాలో ఉదయాన్నే అగ్నిప్రమాదం జరిగింది. రుషికొండ బీచ్ రోడ్డులో వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. అప్రమత్తమైన డ్రైవర్ బయటకు దూకాడు. దీంతో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 08:38 AM IST

పెద్దకడబూరు SIగా మారుతి

KRNL: పెద్దకబూరు మం. SIగా విధులు నిర్వహిస్తున్న నిరంజన్ రెడ్డిని జిల్లా స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గత రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఈ. మారుతిని పెద్దకడబూరు మండల ఎస్సైగా నియమించారు. కొత్త ఎస్సైగా మారుతి త్వరలోనే పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

March 3, 2026 / 08:38 AM IST

ఇసుక లారీని ఢీకొట్టిన కారు.. తప్పిన ప్రమాదం

ASR: అనంతగిరి మండలం, కాశీపట్నం మెయిన్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన పర్యటకులు బొర్రా, అరకు వేలి, పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా, కాశీపట్నం ప్రధాన రహదారి రైతు భరోసా కేంద్రానికి సమీపంలో అనంతగిరి వెళ్తున్న ఇసుక లారీని అదుపుతప్పి ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.

March 3, 2026 / 08:38 AM IST

‘తాగునీటి సరఫరాను వార్డు సెక్రటరీలు పర్యవేక్షించాలి’

VZM: బొబ్బిలి మున్సిపల్ కమీషనర్ ఎల్. రామలక్ష్మీ నిన్న ఇంజినీరింగ్, సచివాలయ ఉద్యోగులలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాను వార్డు సెక్రటరీలు పర్యవేక్షణ చేయాలని సూచించారు. భోజరాజపురం పంపు హౌస్‌’లో అన్ని మోటార్లు పని చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇంఫిల్టిర్‌ బావులు వద్దకు నది నీరు వెళ్లేలా చూడాలన్నారు.

March 3, 2026 / 08:36 AM IST

రైల్వే జోన్ ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌‌గా కవిటి వాసి

SKLM: కవిటి మండలానికి చెందిన పూడి హరి ప్రసాద్(ఐఆర్ ఎఎస్) విశాఖ రైల్వే జోన్‌కు ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ సలహాదారుగా నిన్న బాధ్యతలు స్వీకరించారు. 1994 బ్యాచ్ సివిల్ సర్వీస్‌లో ఉత్తీర్ణ సాధించిన ఆయన రైల్వే, విద్యుత్, దేశ రక్షణ విభాగాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. దీంతో కవిటి మండలానికి చెందిన వాసులు హర్షం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 08:34 AM IST

వ్యవసాయ అధికారులతో MLA జూలకంటి సమీక్ష

PLD: వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యవసాయ అధికారులతో సోమవారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు రైతులకు అందేలా చూడాలని సూచించారు.

March 3, 2026 / 08:30 AM IST

తుళ్లూరులో ఆవుల దొంగ అరెస్టు

GNTR: తుళ్లూరు మండలంలో 25కు పైగా ఆవులను అపహరించిన గుంటుపల్లి శ్రీకాంత్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో నిందితుడు పోలీస్ స్టేషన్ గోడ దూకి పరారవ్వడం కలకలం రేపింది. అయితే, అతని కుటుంబ సభ్యులే తిరిగి అతడిని పోలీసులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. ఆవుల చోరీపై మండలంలోని పలువురు యజమానులు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు రట్టయింది.

March 3, 2026 / 08:30 AM IST

సైబర్ నేరాలపై వాహనదారులకు అవగాహన

కృష్ణా: చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామం ప్రజలకు ఎస్సై దుర్గంజనేయులు సైబర్ నేరాలపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులకు వోటీపీలు, బ్యాంకు వివరాలు, ఆధార్ నంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని తెలిపారు.

March 3, 2026 / 08:30 AM IST

గత నెలలో AMCల ఆదాయం ఏంటంటే..!

కడప జిల్లాలో 11 వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC)లు ఉన్నాయి.వీటిద్వారా గత నెలలో మార్కెట్ సెస్ రూపంలో రూ.1.55 కోట్లు ఆదాయం లభించింది. AMCల వారీగా ఆదాయం రూ.లక్షల్లో ఇలా ఉంది. కడప-18.95, ప్రొద్దుటూరు-20.35, బద్వేల్-29.77, జమ్మలమడుగు-16.64, పులివెందుల-15.48, రాజంపేట-2.80, మైదుకూరు-17.59, కమలాపురం-17.15, సిద్ధవటం-0.47, ఎర్రగుంట్ల-11.49, సింహాద్రిపురం-5.14 లక్షలుగా ఉన్నాయి.

March 3, 2026 / 08:25 AM IST