• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జనసేన జిల్లా సమన్వయకర్తగా రవికుమార్

SKLM: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల సభ్యత్వ నమోదు సమన్వయకర్తల పేర్లను శనివారం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి సుడా ఛైర్మన్ కోరికన రవి కుమార్‌‌ను సభ్యత్వ నమోదు సమన్వయకర్తగా నియమించింది. జిల్లాలో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో జనసేన పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేస్తామన్నారు.

February 21, 2026 / 06:56 PM IST

బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి

SKLM: శ్రీకాకుళం నుంచి పాలకొండకు వెళ్తున్న బస్సులో శనివారం సాయంత్రం ఓ ప్రయాణికుడు గుండెపోటుతో రావడంతో చింతాడ వద్ద బస్సును నిలుపుదల చేసి 108కి చెప్పండి సమాచారమిచ్చారు. దీంతో 108 చేరుకుని బస్సులో ఉన్న ప్రయాణికుని 108లోకి ఎక్కించే సమయంలో ప్రయాణికుడు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది .

February 21, 2026 / 06:50 PM IST

డీజిల్ లోకో షెడ్‌ను తనిఖీ చేసిన డీఆర్‌ఎం

VSP: వాల్తేరు రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా శనివారం డీజిల్ లోకో షెడ్‌ను పరిశీలించారు. కొనసాగుతున్న కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక మార్పుల పురోగతిని సమీక్షించారు. సిమెన్స్ సంస్థ ద్వారా 300 లోకోమోటివ్‌ల నిర్వహణ కోసం చేపట్టిన ప్రాజెక్ట్ పురోగతిపై ప్రత్యేకంగా చర్చించారు.

February 21, 2026 / 06:45 PM IST

గుడ్లవల్లేరులో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా శాఖల వారీగా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితులు, పెండింగ్ పనులపై ఎంపీడీవో ఇమ్రాన్ సమీక్షించారు. ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు సేవలను సమర్థవంతంగా అందించాలని అధికారులకు సూచించారు.

February 21, 2026 / 06:42 PM IST

VIDEO: ‘పచ్చదనం, పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు’

ASR: పచ్చదనం, పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాను క్లీన్ ఆర్గానిక్ జిల్లాగా ఉంచడమే ప్రధాన ద్యేయమన్నారు. “జీరో వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్’ నినాదంతో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర శనివారం పాడేరు మండలం తుంపాడ జీపీయూ స్కూల్లో నిర్వహించారు. వీధులలో, రోడ్లకు ఇరువైపు పరిశీలించి చుట్టుపక్కల వ్యర్ధాలు లేకుండా చూడాలన్నారు.

February 21, 2026 / 06:37 PM IST

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ హుండీ లెక్కింపు

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో ఫిబ్రవరి 4 నుంచి 21 వరకు జరిగిన హుండీ లెక్కింపు ద్వారా రూ. 2,89,12,052ల ఆదాయం వచ్చినట్లు ఏఓ సీనా నాయక్ తెలిపారు. ఇందులో 171 గ్రాముల బంగారం, 2.88 కిలోల వెండి లభించాయి. రోజుకు సగటున రూ. 17 లక్షల ఆదాయం నమోదైంది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు వెల్లడించారు.

February 21, 2026 / 06:37 PM IST

కాణిపాకంలో భక్తుల రద్దీ

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆలయ క్యూలైన్లు నిండి బయటి వరకు భక్తులు వేచి ఉన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో పెంచల కిశోర్ స్పష్టం చేశారు.

February 21, 2026 / 06:34 PM IST

పైపులైను లీకేజ్.. పట్టించుకోని అధికారులు

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధి పార్వతీపురంలో పైపులైను లీకేజీ అయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలుషిత నీరు సరఫరా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 నెలలు కావస్తున్నా అధికారులు పట్టించుకోలేదని పలువురు చెబుతున్నారు. లీకేజీ ప్రాంతం బురదమయం కావడంతో కష్టంగా ఉందని వాహనదారులు తెలిపారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

February 21, 2026 / 06:32 PM IST

ఎస్. కొత్తూరులో పర్యటించిన జాయింట్ కమిషనర్

NDL: పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో ఇవాళ దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ పర్యటించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చంద్రశేఖర్ ఆజాద్ చేరుకోగానే ఆలయ అధికారులు అర్చకులు కలిసి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

February 21, 2026 / 06:32 PM IST

నరసాపురం మండలంలో ఐదుగురు అరెస్ట్

W.G: నరసాపురం మండలం సరిపల్లి శివారులో శనివారం పోలీసులు జరిపిన దాడిలో ఐదుగురు పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 8,760 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై టి. వెంకట సురేశ్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జూదం ఆడుతూ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

February 21, 2026 / 06:31 PM IST

ఆలూరులో AITUC జిల్లా మహాసభల పిలుపు

KRNL: AITUC 21వ జిల్లా మహాసభలు ఆలూరులో మార్చి 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి ఎస్. మునెప్ప శనివారం తెలిపారు. ఈ మహాసభలకు కార్మిక లోకం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మిగనూరులోని సీపీఐ కార్యాలయం ముందు మహాసభల కరపత్రాలను విడుదల చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.

February 21, 2026 / 06:30 PM IST

ఆదివారం పన్ను చెల్లింపు కేంద్రాలు పని చేస్తాయి: కమిషనర్

GNTR: ఆస్తి పన్ను, బకాయిలు చెల్లించడానికి ఆదివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్ను చెల్లింపు కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 వరకు యధావిధిగా పనిచేస్తాయని GMC కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

February 21, 2026 / 06:28 PM IST

చీపురుపల్లిలో పర్యటించిన మాజీ ఎంపీ బెల్లాన

VZM: చీపురుపల్లి పట్టణంలోని పిల్లపేటలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ శనివారం పర్యటించారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వైసీపీ గ్రామ, అనుబంధ కమిటీల నియామకంపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కమిటీలు అత్యంత కీలకమని, వార్డుల వారీగా బాధ్యతగా పనిచేసి కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కష్టపడిన వారికి కమిటీల్లో చోటు కల్పించాలన్నారు.

February 21, 2026 / 06:26 PM IST

ప్రభుత్వానికి ఉద్యోగులే వెన్నెముక: ఎమ్మెల్యే

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని MLA పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. శనివారం సత్యసాయి జిల్లా ఎన్జీవో సంఘం నాయకులు ఎమ్మెల్యేను, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎన్జీవో భవన నిర్మాణానికి సహకరించాలని వారు కోరారు. CM దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

February 21, 2026 / 06:20 PM IST

చీపురి పట్టిన ఎమ్మెల్యే పరిటాల సునీత

ATP: రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆమె స్వయంగా చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి ఆసుపత్రిలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీపురుపట్టి పరిసరాలు శుభ్రం చేశారు.

February 21, 2026 / 06:20 PM IST