• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రాకెట్లలో రాయలకాలపు తామ్ర శాసనాలు లభ్యం

ATP: ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి మూడు తామ్ర శాసనాలను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. క్రీ.శ. 1527లో తెలుగు, సంస్కృత భాషల్లో వీటిని రాయించినట్లు చరిత్రకారుడు బుక్కపట్నం గోపి తెలిపారు. వీటిని పూర్తిస్థాయి విశ్లేషణ కోసం మైసూరులోని పురావస్తు శాఖ కార్యాలయానికి పంపించామని ఆయన వివరించారు.

March 8, 2026 / 04:20 PM IST

వన్ స్టాప్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

SKLM: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వన్ స్టాప్ కేంద్రాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు వన్ స్టాప్ కేంద్రం ఎంతో ఉపయోగ పడుతుంద‌ని తెలిపారు.

March 8, 2026 / 04:16 PM IST

కలెక్టరేట్లో ఉమెన్స్ డే వేడుకలు

ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

March 8, 2026 / 04:15 PM IST

ఈ నెల 12న నరసాపురంలో రేవు పాట

W.G: నరసాపురం మాధవాయిపాలెం-సఖినేటిపల్లి రేవు 2026-27 సంవత్సరానికి బహిరంగ వేలం ఈ నెల 12న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం.నాసరు రెడ్డి ఆదివారం తెలిపారు. ఇప్పటివరకు ఏడుగురు షెడ్యూళ్లను కొనుగోలు చేశారు. నరసాపురం ఎంపీడీవో కార్యాలయంలో సీల్ కం సీక్రెట్ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తరలిరావాలని కోరారు.

March 8, 2026 / 04:14 PM IST

మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రులు బీసీ, ఫరూక్

NDL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ వెలుగు, మెప్మా సంఘాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. జూపాడుబంగ్లాకు చెందిన మహిళా వ్యవసాయ ఉత్పత్తి సంఘాలకు రూ.8 లక్షల విలువైన మహేంద్ర ట్రాక్టర్‌ను అందజేశారు.

March 8, 2026 / 04:12 PM IST

నరసాపురంలో ‘రాయుడు గారి తాలూకా’ చిత్ర యూనిట్ సందడి

W.G: నరసాపురం అన్నపూర్ణ పిక్చర్ ప్యాలెస్‌లో ‘రాయుడు గారి తాలూకా’ చిత్ర బృందం ఆదివారం సందడి చేసింది. చిత్ర హీరో, రచయిత ఉలిశెట్టి శ్రీనివాస్, హీరోయిన్ సత్య యేశా, దర్శకుడు కొర్రపాటి నవీన్ తేజ అభిమానులతో కలిసి సినిమాను తిలకించారు. సినిమా హాల్ వద్ద హీరో, హీరోయిన్లను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. చిత్ర యూనిట్‌కు మెగా అభిమానులు ఘనస్వాగతం పలికారు.

March 8, 2026 / 04:11 PM IST

చిత్తూరు వ్యక్తి తమిళనాడులో మృతి

CTR: చిత్తూరు తాలూకా పరిధిలోని ఓ వ్యక్తి తమిళనాడులో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తాలూకా ఈస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామచంద్ర వివరాల మేరకు.. తుమ్మిందపాళ్యానికి చెందిన దిలీప్ శనివారం కుటుంబ సభ్యులతో గొడవపడి పొన్నైకు వెళ్లి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పొన్నై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

March 8, 2026 / 04:02 PM IST

జోరుగా ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

TPT: జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ ఆధ్వర్యంలో ముద్దుమూడి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చక్రధర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీబలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జన సైనికులు, అభిమానులు పాల్గొన్నారు.

March 8, 2026 / 04:01 PM IST

కొవ్వూరులో ‘గ్రీవెన్స్ డే’ కార్యక్రమం

E.G: కొవ్వూరు TDP కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం ‘గ్రీవెన్స్ డే’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, హెల్త్ పింఛన్లు, ఇళ్లు ఇప్పించాలని కోరుతూ బాధితులు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

March 8, 2026 / 04:00 PM IST

మహిళలకు మెగా చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో మెప్మా ఆధ్వర్యంలో 378 మహిళా సంఘాలకు రూ.62 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.

March 8, 2026 / 04:00 PM IST

కడపలో ఘనంగా మహిళా దినోత్సవం

కడపలోని మేడా కన్వెన్షన్ సెంటర్‌లో స్వయం సహాయక సంఘాల మహిళల చైతన్య సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి హాజరై మహిళలకు నిధుల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జెసీ, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

March 8, 2026 / 03:49 PM IST

మహిళా పారిశ్రామికవేత్తల ప్రతిభను అభినందించిన ఎమ్మెల్యే

కోనసీమ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌లో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా, మెప్మా, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తుల స్టాల్స్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. మహిళా పారిశ్రామికవేత్తల ప్రతిభను చూసి వారిని అభినందించారు.

March 8, 2026 / 03:48 PM IST

మార్చి 15న జిల్లాకు వైఎస్ షర్మిల

VZM: ఏపీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి మార్చి 15న విజయనగరం జిల్లాకు రానున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరిపి విద్యాసాగర్ తెలిపారు. ఉపాధి హామీ పరిరక్షణ పోరాటంలో భాగంగా మార్చి 15న బొబ్బిలి(మం) పారాది గ్రామం, జామి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొనాలని కోరారు.

March 8, 2026 / 03:48 PM IST

మానసిక ఉల్లాసానికి ‘హ్యాపీ సండే’: కమిషనర్

KRNL: ప్రజల మానసిక ఒత్తిడిని తగ్గించి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ప్రభుత్వం ‘హ్యాపీ సండే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం బిర్లా కాంపౌండ్‌లోని ‘ఖానా-ఖజానా’ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలు రోజువారీ పనుల ఒత్తిడిలో ఉంటారని, అలాంటి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం ఉల్లాసంగా గడపాలని ఆయన సూచించారు.

March 8, 2026 / 03:47 PM IST

చంద్రగిరిలో రూ.520 కోట్ల చెక్కులను పంపిణీ

TPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రగిరిలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘ఎన్టీఆర్ విద్యాలక్ష్మి’, ‘ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి’ పథకాలను ప్రారంభించారు. అలాగే మహిళా సంఘాలకు మంజూరైన సుమారు రూ.520 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు.

March 8, 2026 / 03:45 PM IST