KKD: జగ్గంపేట CIగా బి. తిరుపతిరావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో జగ్గంపేట సర్కిల్ పరిధిలో కిర్లంపూడి, గండేపల్లి SIగా నిర్వహించి CIగా పదోన్నతి పొందారు. సర్కిల్ పరిధిలో ఉన్న జగ్గంపేట ఎస్సై రఘునాధ రావు, కిర్లంపూడి ఎస్సై సతీష్ కుమార్, గండేపల్లి ఎస్సై శివ నాగు CI గా బాధ్యతలు చేపట్టిన తిరుపతిరావుకు శుభాకాంక్షలు తెలిపారు.
ATP: గార్లదిన్నె మండలంలో రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండల పరిధిలోని కల్లూరు వద్ద బెంగళూరు- హైదరాబాద్ నేషనల్ హైవే పై ప్రమాదాలు హెచ్చరికలు బోర్డులు ఎస్సై మహమ్మద్ గౌస్ తన సిబ్బంది కలిసి ఏర్పాటు చేశారు. ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణపై ఈ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు.
SKLM: నరసన్నపేట పట్టణం వంశధార కాలనీలో శ్రీ ఉమా సహిత నీలకంఠేశ్వర స్వామి దేవాలయ పునః నిర్మాణానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ కృష్ణం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల: తెనాలికి చెందిన శిరీష బండ్ల ఏరోనాటికల్ ఇంజనీర్‌గా ఎదిగి వర్జిన్ గెలాక్టిక్ ద్వారా 2021లో అంతరిక్షంలోకి వెళ్లి గుర్తింపు పొందారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసిలోకి వెళ్లిన మూడో భారత సంతతి మహిళగా నిలిచారు. ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
VSP: పోర్టు స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్‌లో వాకర్స్‌తో కలిసి బీచ్ వాకింగ్ నిర్వహించారు. అనంతరం వైఎంసీఏ యూత్ హాస్టల్ వద్ద జరిగిన సమావేశంలో సీనియర్ మహిళా వాకర్స్ భారతి, రమణి, మాలతి, సునీతలను సన్మానించారు.
VZM: బొబ్బిలి శ్వేతాచలపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో ఇవాళ ఎమ్మెల్యే బేబీ నాయన తైక్వాండో మీట్ ప్రారంభించారు. తైక్వాండో కోచ్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మీట్‌లో సుమారు 100 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ సంస్థల అధినేత మర్రాపు నాని, చింతా శారద కలవరాయ, తదితరులు పాల్గొన్నారు.
CTR: సోమల(M), నంజంపేటలోని ఖిద్మత్-ఎ-ఖల్క్ మైనారిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి నెల 15 కుటుంబాలకు సహాయం అందిస్తూ వస్తున్న కమిటీ, రంజాన్ నెలలో ప్రతి సంవత్సరం 45 మంది నిరుపేద కుటుంబాలకు కులమతాలకు అతీతంగా నిత్యావసరాలు అందజేస్తోంది. ఈ కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ప్రకాశం: కనిగిరికి చెందిన వైసీపీ మాజీ ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్ చింతల చెరువు సూర్య నారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యదర్శి బీ.ఎల్.సతీశ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల వైసీపీ పదవికి ఆయన రాజీనామ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని అన్నారు.
SKLM: మహిళల సాధికారత తోనే సమాజ అభివృద్ధి సాధ్యం అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ టెక్కలిలో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో అధికారులు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు.
ATP: చమురు సంస్థలు గ్యాస్ ధరలను భారీగా పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడనుంది. గృహ వినియోగ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.114 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలు శనివారం నుంచే అమలులోకి వచ్చాయి. అనంతపురం జిల్లాలో సుమారు 7.97 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక దఫా సిలిండర్ కొనుగోలు చేస్తే ఏకంగా రూ.4.78 కోట్ల అదనపు భారం పడనుంది.
NLR: కావలిలో ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున జనతాపేట సౌత్‌లో బైక్ దొంగతనం జరిగింది. ఇటీవల జనతాపేట నార్త్‌లో ఓ మహిళ మెడలోని బంగారు సరుడు కూడా దొంగతనానికి గురైంది. వరుస ఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతూ పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు.
అన్నమయ్య: వంట గ్యాస్‌పై రూ. 60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచడాన్ని CPM జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు నిన్న తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ రాజకీయ కారణాలతో సామాన్యులపై భారం మోపడం అన్యాయమని, ఇది నిత్యావసరాల ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని TDP, జనసేనలను కోరారు.
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన నారాయణస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకుని స్వామివారికి పొంగళ్ళు నైవేద్యంగా పెట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు.
KRNL: దేవనకొండకు చెందిన బోయ సరోజ జనసేన పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌గా ఎదిగారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కృషి, పట్టుదల ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు.
ఎన్టీఆర్: విస్సన్నపేటలోని బీజేఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న జొన్నలగడ్డ ఏసురత్నం(54) అనే వ్యక్తి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌కు గురై ఆదివారం మృతి చెందాడు. భవన నిర్మాణ పనికి వెళ్ళి 11కేవీ వైర్ తగిలి కింద పడటంతో పదునైన ఆయుధం(గడ్డపలుగు) గుచ్చుకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.