E.G: గోపాలపురం నియోజవర్గంలోని పోతవరం నుంచి జి.కొత్తపల్లి వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను నియోజకవర్గ AMC ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు గురువారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాల పాటించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. MLA మద్దిపాటి వెంకటరాజు సహకారంతో రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయని అన్నారు.
VSP: బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి సూచించారు. స్థానిక మస్తరు కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్, పబ్లిక్ హెల్త్ మేస్త్రీలు, రూట్ సూపర్వైజర్లు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించారు.
ASR: హుకుంపేట మండలం పట్టంపంచాయతీ నుంచి అమనగిరి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర కూటమి నాయకులతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. సుమారు 5కిలోమీటర్ల పొడవుతో రూ.5 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. రోడ్డు లేక ఇన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఆరు గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
నెల్లూరు: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేసిన విజ్ఞప్తులకు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభించింది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న కోవూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
ATP: అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ CM చంద్రబాబును కోరారు. ఉండవల్లి నివాసంలో జరిగిన జిల్లా నేతల సమావేశంలో ఆయన ఇవాళ వినతిపత్రం అందజేశారు. నడిమి వంక, మరువ వంక రక్షణ గోడల నిర్మాణం కోసం రూ.79.46 కోట్లు, మున్సిపాలిటీ పెండింగ్ పనులు, శిల్పారామం మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
కడప: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాలతో సి.కె దిన్నె, పెండ్లిమర్రి, కమలాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్థుల ఇళ్లలో తనిఖీలు చేసి 24 రికార్డులు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాలుపర్తి కఠిన చర్యలు తప్పవు అన్నారు.
GNTR: పొన్నూరు పురపాలక సంఘం కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుధ్య పనులను పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. తదుపరి అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసి అక్కడ అందిస్తున్న భోజన నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కృష్ణా: గుడివాడ ఏజీకే స్కూల్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, లబ్ధిదారులకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు. అన్న క్యాంటీన్లో తక్కువ ధరతో నాణ్యమైన భోజనం అందించడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపాడు.
GNTR: ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో గురువారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వాసంతి మాట్లాడుతూ.. రైతులు తమ శనగ పంటను 14 శాతం తేమ వరకు ఎండలో బాగా ఆరబెట్టిన తర్వాత రేపూడి గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి క్వింటాల్‌కు రూ. 5,875 మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు.
CTR: పుంగనూరులో వేంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారికి సుప్రభాతం, మహాశాంతి అభిషేకం నిర్వహించి అలంకరించారు. తర్వాత ధూప దీపం నైవేద్యాలు సమర్పించిన అనంతరం తిరుప్పావడ సేవ జరిగింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
PPM: కొమరాడ మండలం విక్రమపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని, తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. పదవతరగతి విద్యార్థులతో కాసేపు మాట్లాడి, విద్యా ప్రమాణాలపై కొన్ని ప్రశ్నలను వేసి, విద్యార్థుల మేధస్సును తెలుసుకున్నారు.
PPM: విలేజ్ రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం లభించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం గరుగుబిల్లి మండలంలోని గొట్టివలస గ్రామ సచివాలయంలో నిర్వహించిన విలేజ్ రెవెన్యూ క్లినిక్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ రికార్డులను పరిశీలించి, క్లినిక్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
SKLM: జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన అన్నారు. గురువారం నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హయంలో నిరుద్యోగులకు ప్రైవేటు రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి, వేసవిలో ప్రజలకు చల్లని తాగునీటిని అందించడానికి ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయం వెలుపల చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, AR శ్రీ దేవదాస్, AR DSP శ్రీ చిన్ని కృష్ణ, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.