కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టర్ ఛాంబర్‌లో 2026-27 సంవత్సరానికి నూతనంగా మంజూరైన మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ బాలాజీ మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మీడియా ప్రజల మరియు ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తుందని అన్నారు. బాధ్యతాయుతంగా, నిజనిర్ధారణతో వార్తలను ప్రజలకు చేరవేయాలని సూచించారు.
TPT: తడ-వరదయ్యపాలెం రహదారి మరమ్మతులకు ప్రభుత్వం రూ.2.5 కోట్లు మంజూరు చేసినట్టు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి అదిమూలం తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. రోడ్డు గుంతలను పూడ్చి ఒక లేయర్ వేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
SKLM: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎల్‌ఎన్ పేట మండలానికి చెందిన యశోదమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 70,322లక్షల వేల చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
KDP: బద్వేల్ పరిధిలోని ఆంజనేయ నగర్ ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం రూ.7,50,000 నిధులతో డ్రైనేజ్ కాలువ పనులు ప్రారంభమైనట్లు మున్సిపల్ కమీషనర్ నరసింహారెడ్డి గారు తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత మురుగు నీటితో పాటు వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా సాఫీగా వెళ్లే విధంగా సదుపాయం కలుగుతుందని తెలిపారు.
VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో కొత్తవలస సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో గురుదేవా చారిటబుల్ ట్రస్టు సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు మంగళవారం నిర్వహించారు. ఉచిత మెడికల్ క్యాంపులో డా. కామాక్షి పాల్గొని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగితెలుసుకుని మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ పోలీసులు పాల్గొన్నారు.
సత్యసాయి: మడకశిర మండలం నీలకంఠాపురంలో శ్రీరామనవమి బ్రహ్మరథోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో గోవిందాపురం, గంగలవాయి పాళ్యం పంచాయతీల గ్రామ పెద్దలతో కలిసి ఉత్సవాల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. సామూహిక ఉచిత వివాహాలు, బ్రహ్మరథోత్సవం, పుట్ల పురుష నిర్వహించనున్నారు.
E.G: రంగంపేట మండలం వడిశలేరులో సుమారు రూ.98 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.15 లక్షలతో బోర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, స్థానిక సొసైటీ వద్ద శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
NDL:డోన్‌లో రోటరీ క్లబ్ 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ సభ్యులు సమావేశమై కొత్త అధ్యక్షుడిగా గంగిరెడ్డిని కార్యదర్శిగా మల్లారెడ్డిని ఎంపిక చేశారు. గత సంవత్సరాల్లో క్లబ్ నిర్వహించిన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించే దిశగా కొత్త కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. సభ్యులందరూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియాజేశారు.
PPM: గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 6న ఉదయం10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు. మేళాలో 14 రకాల కంపెనీలు 1500కి పైగా ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 18 సంవత్సరాలు పైబడిన టెన్త్, ITI, డిప్లమో, డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు. https://forms.gle /XBJDhj1QVsGZtek68 లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
VZM: గరివిడి మండలం పరిషత్ కార్యాలయానికి మూడు చక్రాల సైకిల్స్ చేరుకున్నాయి. ఈ వాహనాలు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా 22 పంచాయతీలకు మంజూరయ్యాయని ఈవోపీఆర్డీ పుష్పాంజలి తెలిపారు. పంచాయతీలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు అందిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఉదయాన్నే చెత్త శుభ్రం చేసి తడి, పొడి చెత్తను వేరుచేసి డంపింగ్‌కి తరలించడానికి ఉపయోగపడుతుందన్నారు.
ATP: అంగన్వాడీల అక్రమ అరెస్ట్‌లను వ్యతిరేకిస్తూ గుత్తి ఎన్టీఆర్ సర్కిల్లో అంగన్వాడీ టీచర్లు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ టీచర్ కళ్యాణి మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో జరుగు మహా ధర్నాకు వెళ్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. ఇలా అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలు ఆపలేరన్నారు.
KDP: సిద్దవటం మండలంలోని కొత్త మాధవరం 123 వార్డులో వెలసిన శ్రీ భక్త వీరాంజనేయ స్వామికి మంగళవారం విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం,అలంకరణ ,గణపతి పూజ, ఆకు పూజ, వడమాల పూజ, సహస్రనామార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
CTR: వేద పండితుల సూచనల మేరకు శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం మంగళవారం ఉదయం 9:00 గంటలకు మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం 6:00 గంటలకు ఆలయ శుద్ధి నిర్వహించి, అమ్మవారికి అభిషేకం చేస్తారని తెలిపారు. అనంతరం భక్తులకు దర్శనాలు యథావిధిగా కల్పించబడతాయి.
సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు చాఫ్ కట్టర్ మిషన్లను ఎమ్మెల్యే ఎంఎస్.రాజు పంపిణీ చేశారు. మెలవాయి, కళ్ళుమరి, రేకులకుంట, ఏఆర్ రూపం గ్రామాల నుంచి వచ్చిన రైతులకు ఈ యంత్రాలను అందజేశారు. పశుగ్రాసం వృథా కాకుండా చూసేందుకు ఈ మిషన్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
సత్యసాయి: వినియోగదారుల హక్కుల రక్షణకు జిల్లా యంత్రాంగం కొత్త ఫిర్యాదుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. రేషన్ సరుకుల పంపిణీ, గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ బంకుల్లో అక్రమాలపై 08555-288566 నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. నిత్యావసర వస్తువుల సరఫరాలో పారదర్శకత కోసం ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు.