• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఫిర్యాదులు వెల్లువెత్తినా స్పందన శూన్యం

VZM: గంట్యాడ మండలం బోనంగి శివారులో నెలకొన్న అపరిశుభ్రత పరిస్థితి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని గ్రామస్థులు మండిపడుతున్నారు. చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తున్నా ఎలాంటి చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

March 3, 2026 / 10:37 AM IST

గ్రహణం వేళ మూతపడిన త్రికోటేశ్వర స్వామి ఆలయం

PLD: చంద్రగ్రహణం కారణంగా పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గ్రహణ ప్రభావంతో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు భక్తులకు దర్శనం ఉండదని అర్చకులు తెలిపారు. గ్రహణం వీడిన తర్వాత ఆలయ శుద్ధి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

March 3, 2026 / 10:36 AM IST

బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

విశాఖలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు జగదాంబ సమీప నివాసి ఎం. శ్రీధర్ (36)గా గుర్తించారు. ఆయన కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి బీచ్‌లో రాళ్ల మధ్య మృతదేహం కనిపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 3, 2026 / 10:32 AM IST

పాఠశాలల్లో అటకెక్కిన ‘ముస్తాబు’ పథకం..!

NLR: విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత పెంచేందుకు ప్రభుత్వం తెచ్చిన ‘ముస్తాబు’ పథకం పర్యవేక్షణ లేక అటకెక్కింది. ప్రతి బడిలో అద్దం, దువ్వెన, నెయిల్ కట్టర్లతో కార్నర్లు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు అమలు కావడం లేదు. జిల్లాలోని 2,584 స్కూళ్లు, లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితిపై డీఈవో బాలాజీరావు స్పందిస్తూ.. పథకం సక్రమంగా అమలయ్యేలా చూస్తామన్నారు.

March 3, 2026 / 10:29 AM IST

దక్షిణ కాశీ శ్రీముఖలింగం ఆలయ తలుపులు మూసివేత

SKLM: జలుమూరు M శ్రీముఖలింగంలో ఉన్న దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖి లింగేశ్వర స్వామి ఆలయాన్ని గ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు దేవాలయ శాఖ అధికారులు, అర్చకులు మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన అనంతరం రాత్రి 7:30 గంటలకు ఆలయ తలుపులు తిరిగి తెరిచి సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈవో ఏడుకొండలు తెలిపారు.

March 3, 2026 / 10:20 AM IST

‘రెవెన్యూ క్లినిక్‌లతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం’

సత్యసాయి: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ‘రెవెన్యూ క్లినిక్స్’ కార్యక్రమం ద్వారా భూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారు. తహసీల్దార్‌లు, ఆర్డీవోలు ఒకేచోట రికార్డులను పరిశీలిస్తూ అడంగల్ మార్పులు, మ్యుటేషన్లు, వారసత్వ నమోదు పనులు పూర్తి చేస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నారు.

March 3, 2026 / 10:08 AM IST

వినతులు తగ్గేలా చర్యలు తీసుకోవాలి: జే.సీ

PPM: రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన వినతులను తక్షణమే పరిష్కరించాలని పార్వతి పురం మన్యం జిల్లా ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తహసీల్దార్లను ఆదేశించారు. మండలం స్థాయిలో గ్రీవెన్స్ తగ్గేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ అంశాలు, వివిధ వినతుల పురోగతిపై తహసీల్దార్లతో ఆయన ఛాంబర్‌లో సమీక్షించారు.

March 3, 2026 / 10:08 AM IST

చెట్టుపై ఎలుగుబంటి పిల్ల.. భయాందోళనలో గ్రామస్తులు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బర్రివాని తోటలో మునగ చెట్టుపై ఎలుగుబంటి పిల్ల కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. రాత్రి సమయంలో కుక్కలు అరవటంతో మేల్కొన్న గ్రామస్తులు ఎలుగుబంటి పిల్లని గమనించారు. తల్లి ఎలుగుబంటి సమీపంలోనే ఉండే అవకాశం ఉందని, గతంలో ఎలుగుబంటి దాడుల్లో ఇద్దరు మరణించారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 3, 2026 / 10:07 AM IST

‘పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలి’

KKD: జిల్లాలోని పట్టణాలు, ప్రవేశ రహదారులను శుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మున్సిపల్, ప్రజారోగ్యం, సాగునీటి శాఖల అధికారులతో పట్టణ పారిశుద్ధ్యంపై సమీక్షించారు. పారిశుద్ధ్య మెరుగుదలకు పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు.

March 3, 2026 / 09:57 AM IST

అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు

VZM: చీపురుపల్లి పట్టణం పాత కుమ్మరి వీధిలో మంగళవారం చిన్నారులు ఉత్సాహంగా ఆనందంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు.  ఒకరిపై ఒకరు రంగులు చలుముతూ అన్నదమ్ములు ఆప్యాయతను పురస్కరించుకుని రంగులు జల్లుకుంటూ ఆనందంగా వీధుల్లో హోలీ పండుగ చేసుకున్నారు. ఈ వేడుకలను చూపరలను ఆకట్టుకున్నాయి.

March 3, 2026 / 09:56 AM IST

బోసిపోయిన అలిపిరి.. 10 గంటలు ఆలయం మూత

TPT: ఇవాళ చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. భక్తులతో నిరంతరం సందడిగా ఉండే అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం ఇవాళ ఖాళీగా కనిపిస్తోంది. ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. రాత్రి 8:30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

March 3, 2026 / 09:55 AM IST

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం మూసివేత

కోనసీమ: చంద్రగ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆలయ అర్చకులు మూసివేశారు. ఈ మేరకు స్వామివారికి పూజలను నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన ద్వారాన్ని ఆలయ అర్చకులు మూసివేశారు. బుధవారం ఉదయం 7:30కు సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

March 3, 2026 / 09:54 AM IST

చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత

NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ఆలయ సిబ్బంది మంగళవారం మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు సిబ్బంది తెలియజేశారు. ఇవాళ రాత్రి 8:30 గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరుగుతుందని తెలిపారు.

March 3, 2026 / 09:52 AM IST

ఎస్వీయూలో డ్రోన్ పైలట్ శిక్షణ ప్రారంభం

తిరుపతి ఎస్వీయూలో రూసా–2 కింద 15 రోజుల డీజీసీఏ-ఆర్పీటీఓ డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య టాటా నరసింగరావు ప్రారంభించారు. డ్రోన్ ఆపరేషన్లు, మ్యాపింగ్, నిఘా, సర్వే వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నారు.మొదటి రెండు బ్యాచుల్లో మొత్తం 40 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.

March 3, 2026 / 09:50 AM IST

మత్తు మాత్రలు ఇచ్చి చైన్ దొంగతనం చేసిన మహిళ అరెస్ట్

TPT: శ్రీవారి దర్శనానికి వచ్చిన వృద్ధురాలికి టీలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చి 73 గ్రాముల బంగారు తాళిబొట్టు చైన్ దొంగిలించిన మహిళను తిరుమల టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు దర్యాప్తు చేసి నిందితురాలు వల్లి (56)ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద 8.4 గ్రాముల బంగారం, నిద్ర మాత్రలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

March 3, 2026 / 09:47 AM IST