E.G: రాష్ట్ర వైసీపీ CEC మెంబర్‌గా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావును నియమించారు. ఈ సందర్భంగా ఆయన, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్‌తో కలిసి బుధవారం తాడేపల్లి పార్టీ కార్యాలయం నందు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతం రామ్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ పాల్గొన్నారు.
TPT: భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం కల్పించారు. రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. జయభరత్ నగర్‌లో CC రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకురాగా, ఆయన స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తక్షణమే రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
VSP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాలలో ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాదికార సంస్థ మంగళవారం ప్రకటనలో తెలిపింది. లోక్ అదాలత్లో న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాలు పరిష్కరించుకోవచ్చని సూచించింది.
TPT: ఎండలు భగ్గుమన్న వేళ నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ భారీగా పెరగడంతో మన ప్రాంత నిమ్మకాయలకు మంచి మార్కెట్ దక్కుతోంది. ప్రస్తుతం కిలో నిమ్మకాయలు వంద వరకు పలుకుతుండటంతో బాలాయపల్లె రైతులకు లాభాలు చేకూరుతున్నాయి. ఎండల తీవ్రత పెరగడం, నిమ్మరసం వినియోగం అధికమవడం వల్లే ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుందని వ్యాపారులు చెబుతున్నారు.
NDL: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు. ‘కృతజ్ఞతకు, ఆశకు పోటీ పెడితే ఆశే గెలుస్తుంది. ఆ ఆశను కూటమి సృష్టించింది. ఆ ఆశతోనే ప్రజలు మోసపోయారు. చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోవడం ఇది మొదటిసారి కాదు. నాలుగోసారి. జగన్ చేస్తున్న సంక్షేమం అంతా అనవసరమైనదని ప్రచారం చేసి, ఎన్నికల సమయంలో జగన్ కంటే ఎక్కువ ఇస్తామని ఆశ’ పెట్టారన్నారు.
NDL: చాగలమర్రి మండలం కృష్ణంపల్లెలో వెలసిన ప్రసిద్ధ జమల్ వలి స్వామి ఉరుసు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభించనున్నట్లు దర్గా నిర్వాహకులు వెన్నపూస పుల్లారెడ్డి తెలిపారు. బుధవారం ఉరుసు కార్యక్రమం వైభవంగా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీకాకుళం పట్టణంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. డయేరియా నియంత్రణలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పట్టణంలో 50 డివిజన్లు పరిధిలో పారిశుద్ధ్యం పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులను జాయింట్ కలెక్టర్, ఇంఛార్జ్ మున్సిపల్ కమిషనర్ పర్మాన్ అహ్మద్ ఖాన్ పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటి చెత్త సేకరణ కొనసాగిస్తున్నారు.
సత్యసాయి: ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి మీదుగా కోడూరు వరకు సాగుతున్న 342వ జాతీయ రహదారి నిర్మాణం అసంపూర్తిగానే మిగిలింది. పాత ఆర్ఎంపీ రోడ్డును జాతీయ రహదారిగా మార్చినప్పటికీ ఆ స్థాయి సౌకర్యాలు కనిపించడం లేదు. నిధులున్నా భూసేకరణలో ఆలస్యం, రైతులకు పరిహారం అందకపోవడంతో పనులు నిలిచిపోయాయి. త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
W.G: టిడ్కో లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం ఎల్. అగ్రహారం టిడ్కో గృహ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. పై అంతస్తులకు వెళ్లలేని వారికి లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే శ్రీవారి ఆలయం, త్వరలో వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు.
VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేటలో నివాసముంటున్న కె.బంగారం మెడలోని 2 తులాల బంగారం పుస్తెలతాడును గుర్తు తెలియని వృద్ధురాలి అపహారించుకుపోయింది. పోలీసుల వివరాలు.. వృద్ధురాలి పెద్ద కోడలు ఓ టైలర్ షాపులో పని చేస్తోంది. తన కోడలు పంపించిందని పరిచయం చేసుకున్న మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును అపహారించింది. దీంతో కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
KRNL: కర్నూలు-కాచిగూడ మధ్య తిరిగే రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్ నగర్ నుంచి డోన్ వరకు రైల్వే డబ్బింగ్ పనులు జరుగుతున్నందున తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారి ఏ.శ్రీధర్ పేర్కొన్నారు. కర్నూలు-కాచిగూడ రైలు (17436)ను ఈనెల 8వ తేదీ వరకు, కాచిగూడ-కర్నూలు (17437)ను 7వ తేదీ వరకు రద్దు చేశామన్నారు.
కృష్ణా: గుడివాడలో బెట్టింగులు,పేకాట, వ్యభిచారం, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. నంబర్ ప్లేట్లు లేని బైకులు, కార్లుకు గుడివాడలో అనుమతి లేదని తెలిపారు. సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన మంగళవారం విజ్ఞప్తి చేశారు.
నెల్లూరులో చోరీలు, హత్యల వంటి కేసుల ఛేదనలో క్లూస్ టీం కీలక పాత్ర పోషిస్తోంది. వేలిముద్రలు, రక్త నమూనాల ఆధారంగా నిందితులను పట్టుకుంటున్నారు. ఇటీవల గూడూరు, నవాబుపేట పరిధిలోని దొంగతనాల కేసులను ఈ బృందం ఛేదించింది. 2025లో ఇప్పటివరకు 50 కేసులను పరిష్కరించారు. అధునాతన సాంకేతికతతో నేరస్తుల డేటాబేస్‌ను ఉపయోగించి వీరిని గుర్తిస్తున్నారు.
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ ఆవరణలో బుధవారం నుంచి 10వ తేది వరకు సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు సుందరకాండ పారాయణం జరుగుతుందన్నారు. ఈ పారాయణాన్ని ఎం.ఎస్ రామారావు మనవడు డాక్టర్ శ్రీనివాస్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.