మందపల్లి శనీశ్వర స్వామి ఆలయాన్ని ఓ భక్తుడు అపవిత్రం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తమండం మందపల్లిలో ఉన్న ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది.
నవంబర్ 28న చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సాగనుంది. ఈ తరుణంలో ఆయన రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తన లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కొడుకు పెళ్లి రిసెప్షన్‌కు బాబు హాజరుకానున్నారు.
చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిపోయిన నారాలోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ పునఃప్రారంభం కానుంది. నవంబర్ 27వ తేది నుంచి పాదయాత్ర సాగుతుందని, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.
అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 10 మందికి తీవ్రంగా గాయలయ్యాయి.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో సిగరెట్ తాగి బోట్ ఇంజిన్‌పై విసిరివేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం మరికొందరిని కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.
ఏపీ సీఎం జగన్ మరో సారి జైలుకు వెళ్లే సమయం దగ్గర పడిందని టీడీపీ నేత నారా లోకేష్ పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పుడుతున్నారని ఆరోపించారు. తనకు ఇది వరకు కేటాయించిన జైలు దుస్తులను ఉతికించి పెట్టుకొమ్మని సూచించారు.
ప్రధాని మోడీ పర్యటన విధుల్లో ఉన్న ఐబీ డీఎస్పీ కృపాకర్ తిరుమల మెట్ల మార్గంలో గుండెపోటు వచ్చి చనిపోయారు.
విశాఖలో అగ్నిప్రమాదంలో బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించారు. ఒక్కొక్కరికీ రూ.50 వేల ఆర్థిక సాయం చేశారు.
పవన్ కళ్యాణ్‌పై ఓ వ్యక్తి చెప్పు దాడికి యత్నించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో అది ఇప్పటి వీడియో కాదని, కొందరు కావాలనే పవన్ కళ్యాణ్‌పై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని జనసైనికులు హెచ్చరించారు.
తన జీవితంతో ఆడుకోవద్దని మత్స్యకారులు, యూట్యూబర్లను లోకల్ బాయ్ నాని వేడుకున్నాడు. బోటు ప్రమాదంతో తనకేమీ సంబంధం లేదని తేల్చిచెప్పాడు.
విశాఖ నుంచి పాలనకు అన్ని ఏర్పాట్లను వైసీపీ సర్కార్ పూర్తి చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని శాఖలు అక్కడికి తరలి వెళ్లాయి. తాజాగా మిగిలిన అన్ని శాఖలకు సంబంధించి భవనాలను కేటాయించాలని జీవో జారీ అయ్యింది. అందుకోసం ప్రత్యేక కమిటీని కూడా సీఎం జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది.
చంద్రబాబు అసలు ఎక్సైజ్ శాఖ చూడలేదు, ఆ ఫైలుపై సంతకం చేయలేదని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జగన్ కుట్రకోణంలో భాగంగానే మరో తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు.
ఓ విద్యార్థిని ప్రేమిస్తున్నానని టీచర్ మోసం చేశాడు. ఇంటికి తీసుకెళ్లి తాళి కట్టాడు. పెళ్లి అయ్యింది కదా అని.. ఆపై లైంగికదాడి చేశాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.
ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయానే అంశంపై ఎంపీ రఘురామ రాజు హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు సీఎం జగన్ సహా 41 మందికి నోటీసులు జారీ చేసింది.
ఇటివల కాలంలో పెంచుకున్న పెంపుడు జంతువులకు కూడా పుట్టినరోజు వేడుకలు జరిపించడం ట్రెండ్ గా మారుతుంది. వాటిలో శునకాలు, పిల్లి, గాడిద, గుర్రం వంటి వాటికి ఇప్పటికే జరుపగా..ఆ జాబితాలో తాజాగా కోడి కూడా చేరింది. అవునండి బాబు ఇటివల కోడిపుంజుకు బర్త్ డే వేడుకలు ఘనంగా జరిపించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.