ఇద్దరి మధ్య గొడవతో ఏకంగా నడిరోడ్డుపై గోడ కట్టేశారు. సీసీ రోడ్డుపై 3 అడుగుల గోడ నిర్మించారు. ఈ ఘటన ఏపీలో గల పల్నాడు జిల్లాలో జరిగింది.
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాసులకు బిగ్ అలర్ట్. ఏపీలో భారీ వర్షాలు కురువనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు తుపానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలో పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవ్వనున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల అంశం రోజుకో రచ్చ సృష్టిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోటీగా కేసులు నమోదవుతున్నాయి. తమపై దాడి చేసి సాగర్ డ్యామ్‌పైకి అక్రమంగా చొరబడ్డారని.. ఏపీ పోలీసులపై డ్యామ్ వద్ద సెక్యూరిటీ ఉన్న తెలంగాణ ఎస్‌పీఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారు.
శిరీష అలియాస్ బర్రెలక్క ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఎన్నికల బరిలో నిలవడంతో దేశమంతా ఆమె పేరు మారుమోగింది. తాజాగా బర్రెలక్కను స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో దాసరి కవిత అలియాస్ జుమ్ చక జుమ్ చక స్టార్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది.
ఏపీ సర్కార్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులను తీసుకొచ్చేందుకు ప్రణాళిక వేస్తోంది. అందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు జర్మన్, జపాన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో బోధన అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
ఏపీలో జగన్ పాలనను అంతం చేసి ఆయన్ని పదేళ్లపాటు బయటకు తరిమికొడదామని జనసేన అధినేత పవన్ పిలుపునిచ్చారు. జనసేన టీడీపీ వెనక ఉండి నడవడం లేదని, టీడీపీతో కలిసి నడుస్తోందని తెలిపారు.
నాగార్జున సాగర్ జలాల విడుదల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. నేడు కేంద్ర హోం శాఖ ఆధర్యంలో రెండు రాష్ట్రాల్లో ఓ నిర్ణయానికి వచ్చాయి. దీంతో వివాదం ముగిసింది. ఇకపై సాగర్ ప్రాజెక్ట్ సీఆర్పీఎఫ్ దళాల ఆధీనంలో ఉండనుంది.
ఏపీలో భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సర్వర్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకూ చాలా మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాశారు. సర్వర్ ప్రాబ్లమ్‌తో చేసేదేమీ లేక వారంతా వెనుదిరిగారు.
సాగర్ కుడికాలువ నుంచి నీటి విడుదలను తక్షణమే ఆపాలని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు స్పష్టంచేసింది.
అమెరికాలో వైసీపీ నేత.. ఓ కుర్రాడికి నరకం చూపించాడు. మంచి జాబ్ ఉందని చెప్పి 7 నెలల నుంచి టార్చర్ పెట్టాడు. అతనికి మరో ఇద్దరు సహకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని, మరో మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నాగార్జున సాగర్‌లో తమకు న్యాయంగా రావాల్సిన నీటిని విడుదల చేస్తున్నామని, తమ భూభాగంలోకి మాత్రమే పోలీసులు ప్రవేశించారని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు.
ఏపీలోని కాకినాడ తీరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మత్య్సకారులను కోస్టుగార్డు సిబ్బంది రక్షించారు. కొంచెంలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఏపీ సర్కార్ 2024వ ఏడాదికి సంబంధించిన సాధారణ సెలవుల జాబితాను ప్రకటించింది.