»Cm Jagans Key Decision Teaching In German Japanese French And Spanish For Classes 9 And 10
CM Jagan: కీలక నిర్ణయం..9, 10 తరగతులకు జర్మన్, జపాన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో బోధన!
ఏపీ సర్కార్ విద్యా వ్యవస్థలో కీలక మార్పులను తీసుకొచ్చేందుకు ప్రణాళిక వేస్తోంది. అందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు జర్మన్, జపాన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో బోధన అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) సీఎం జగన్ (Cm Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశీ భాషా బోధనను అమలు చేసేందుకు ప్రణాళిక వేశారు. 9, 10వ తరగతుల వారికి జర్మన్, జపాన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో బోధన అందించాలని, అది కూడా వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి 8వ తరగతి విద్యార్థులకు డిసెంబర్ 21వ తేది నుంచి ట్యాబులు పంపిణీ (Tabs Distribution) చేయనున్నట్లు వెల్లడించారు.
విద్యాశాఖ (Department of Education)పై సీఎం జగన్ (Cm Jagan) రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ (Tabs Distribution) విషయంలో కీలక నివేదిక అందించారు. ట్యాబుల్లో విద్యార్థుల సందేహాలను తీర్చే యాప్లను ఇన్స్టాల్ చేస్తున్నట్లు తెలిపారు. పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల్లో లక్షా 49 వేల మంది పునఃప్రవేశాలు పొందినట్లుగా వెల్లడించారు.
ఉపాధ్యాయులకు ట్యాబ్లు (Tabs) ఇవ్వడం వల్ల విద్యాబోధనలో మంచి మార్పులు వచ్చాయన్నారు. గత ఏడాది ట్యాబులు పొందిన ఉపాధ్యాయులు 77 నిమిషాల పాటు పాఠ్యాంశాలను వింటున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థులు కూడా రోజుకు 67 నిమిషాల పాటు పాఠ్యాంశాలను విని తమ సందేహాలను తీర్చుకుంటున్నారని, విద్యా వ్యవస్థలో ఇదొక మంచి పరిణామమని అన్నారు. డిసెంబర్ 21వ తేది నుంచి విద్యార్థులకు ట్యాబులు పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.