»Sagar Water Release Dispute Over Dam Under The Supervision Of Crpf Forces
Nagarjuna Sagar: ముగిసిన నాగార్జునసాగర్ వివాదం..సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణలో డ్యామ్!
నాగార్జున సాగర్ జలాల విడుదల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. నేడు కేంద్ర హోం శాఖ ఆధర్యంలో రెండు రాష్ట్రాల్లో ఓ నిర్ణయానికి వచ్చాయి. దీంతో వివాదం ముగిసింది. ఇకపై సాగర్ ప్రాజెక్ట్ సీఆర్పీఎఫ్ దళాల ఆధీనంలో ఉండనుంది.
రెండు రోజుల నుంచి నాగార్జున సాగర్ (Nagarjunasagar) జల వివాదం నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఈ వివాదంపై ఆందోళన చెందుతున్నారు. ఎట్టకేలకు నేడు సాగర్ జలాల వివాదం ముగిసింది. డ్యామ్ నిర్వహణను కృష్ణా రివర్ వాటర్ బోర్డు మేనేజ్మెంట్ (Krishna River water Management)కు అప్పగించడానికి రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. నవంబర్ 28వ తేదికి ముందున్న పరిస్థితినే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాయి.
కేంద్ర హోంశాఖ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాలు అంగీకరిస్తూ తీర్మానించాయి. నాగార్జున సాగర్ పర్యవేక్షణ బాధ్యతను సీఆర్పీఎఫ్ (CRPF) దళాల పర్యవేక్షణలో ఉండేందుకు ఒప్పుకున్నాయి. ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలను కచ్చితంగా అమలు చేయాలని రెండు రాష్ట్రాలు (Two States) కోరడంతో వివాదం ముగిసింది.
కృష్ణా జలాల్లో 66 శాతం ఆంధ్రప్రదేశ్‌కి, 34 శాతం తెలంగాణ రాష్ట్రం పంచుకోవాలని నిర్ణయించాయి. ఇకపై ఈ నిర్ణయాన్ని కృష్ణా రివర్ వాటర్ బోర్డు మేనేజ్మెంట్ అమలు చేయనుంది. నిన్న తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాగర్ ప్రాజెక్టుపై 13 గేట్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో వివాదం తలెత్తింది. ఏపీ తన పరిధిలోని మూడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడం వల్ల వివాదం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం కేంద్రం జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించింది.