»Land Registrations Stopped In Ap Crowded Until The Evening
Andhrapradesh: ఏపీలో నిలిచిన భూ రిజిస్ట్రేషన్లు..సాయంత్రం వరకూ జనం పడిగాపులు!
ఏపీలో భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సర్వర్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకూ చాలా మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాశారు. సర్వర్ ప్రాబ్లమ్‌తో చేసేదేమీ లేక వారంతా వెనుదిరిగారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో భూముల రిజిస్ట్రేషన్లు (Land Registrations) ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆధార్ ఈకేవైసీ (E-Kyc)లు పనిచేయకపోవడంతో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. దీంతో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఆఫీసుల (Registrations Offices) ముందు జనం పడిగాపులు కాశారు.
భూముల కొనుగోలు, అమ్మకందారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వరకూ చాలా మంది ఆఫీసుల (Registrations Offices) వద్దే ఉన్నారు. అయితే ఈ రోజంతా రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశం లేదని అధికారులు ఎట్టకేలకు ప్రకటించారు. దీంతో చేసేదేమీ లేక రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు వెనుదిరిగారు. శుక్రవారం ఉదయం 10.30 నుంచి భూ రిజిస్ట్రేషన్ సేవలు (Registration Services) నిలిచిపోయాయి.
సర్వర్ లో సాంకేతిక లోపం (Server Problem) తలెత్తడం వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయినట్లుగా అధికారులు తెలిపారు. అయితే వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఆధార్ కేవైసీ (Adhar Kyc) రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ కాకపోవడం వల్ల నేడు సమస్య తలెత్తిందని, శనివారం నుంచి భూ రిజిస్ట్రేషన్ (Land Registrations) సేవలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.