»A Huge Fire Broke Out In The Telangana Tourism Department Headquarters
Fire Accident: తెలంగాణ టూరిజం ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని తెలంగాణ టూరిజం శాఖ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫీస్ మొదటి అంతస్తులోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.
Fire Accident: హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని తెలంగాణ టూరిజం శాఖ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫీస్ మొదటి అంతస్తులోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లోని ఫైళ్లు, ఫర్నీచర్, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. అదేవిధంగా మంటలు చెలరేగడంతో కార్యాలయం కింద ఉన్న రెండు ఇన్నోవా కార్లపై అగ్ని కీలలు పడిపోవడంతో అవి కూడా దగ్ధమయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టూరిజం శాఖ ఎండీ మనోహర్ ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దీంతో వెంటనే ఈ ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కాగా, టూరిజం శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రమాద స్థలాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శించారు. ఉద్దేశపూర్వకంగానే అగ్ని ప్రమాదానికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లోని ముఖ్యమైన ఫైళ్లు దగ్ధమయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం వల్లే ఈ ప్రమాదం ఏర్పడిందన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం అవినీతిని బయటపెట్టకుండా కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఇటీవల పర్యాటక శాఖ ఎండీ మనోహర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊడిగం చేయడం వల్లే ఎన్నికల సంఘం తనను సస్పెండ్ చేసిందన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సీపీఐ నారాయణ అన్నారు.