CM Jagan Followers Torturing Youth In USA:Nara Lokesh
Nara Lokesh: అమెరికాలో ఏపీకి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడిపై అదే రాష్ట్రానికి చెందిన ముగ్గురు ప్రతాపం చూపించారు. సత్తార్ వెంకటేశ్ రెడ్డి, నిఖిల్, శ్రవణ్ అనే ముగ్గురు నరకం చూపించారు. దాదాపు 7 నెలల పాటు టార్చర్ పెట్టారని తెలిసింది. బాధిత యువకుడు రెస్టారెంట్ వెళ్లగా.. అక్కడ మరో వ్యక్తి కనిపించాడు. బాధతో ఉండగా సమస్య గురించి ఫోన్ చేయాలని నంబర్ ఇచ్చాడు. తనను టార్చర్ పెట్టే విధానాన్ని వాట్సాప్ చేశాడు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఉంటోన్న ఇంటికి వెళ్లగా.. ఆ ముగ్గురు తలుపు తీయలేదు. పోలీసులు వచ్చారని తెలుసుకొని, బాధితుడు వచ్చి తనను పెట్టిన టార్చర్ వివరించాడు. ఆ ముగ్గురిపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందులో సత్తార్ వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ నేత అని టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. వైసీపీ జెండా పట్టుకున్న ఉన్న ఫోటో, సీఎం జగన్తో ఉన్న ఫోటోలను ట్వీట్ చేశారు. భవిష్యత్ ఉందని పిలిపించి.. అమెరికాలో యువకుడికి నరకం చూపించారని లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. జగన్ ఏపీ ప్రజల రక్తం పీల్చుతుంటే.. అతని అనుచరులు యువతపై శాడిజం చూపిస్తున్నారని ఆరోపించారు.
సైకో జగన్ ఆంధ్రప్రదేశ్ జనం రక్తం పీల్చుతుంటే, ఆయన అనుచర పిల్ల సైకోలు అమెరికాలో ఏపీ యువతపై శాడిజం చూపిస్తున్నారు. ఏపీకి చెందిన 20 ఏళ్ల కుర్రాడికి బంగారు భవిష్యత్తు ఆశ చూపించి అమెరికా రప్పించి, అక్కడ కూడా తమ అధినేత జగన్ లాగే సైకోయిజం చూపించాడు వైసీపీ నేత సత్తారు… pic.twitter.com/PCcWmwHENc
కుర్రాడిని ఇంట్లో బంధించి, కొట్టి, చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. అది అమెరికా కాబట్టి.. బాధితుడు సేవ్ అయ్యాడని లోకేశ్ (Lokesh) అన్నారు. ఏపీలో అయితే ఆ బాధిత యువకుడిపై రివర్స్ కేసు పెట్టే వారని గుర్తుచేశారు. సీఐడీ చేత దర్యాప్తు చేయించారని తెలిపారు. అమెరికా ప్రభుత్వం ముందు వైసీపీ సైకోల ఆటలు సాగవని స్పష్టంచేశారు.