»Election Polling Of 5 States Ended Total Rs 1766 Crores Seized
Elections: ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్..మొత్తంగా రూ.1766 కోట్లు సీజ్
ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో నెల రోజుల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఐదు రాష్ట్రాల్లో కలిపి రూ.1766 కోట్ల నగదు, బంగారం, మద్యం, వస్తువులను సీజ్ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
5 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ (Elections Polling) ముగిసింది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం ఓటింగ్ (Voting) ప్రక్రియ ముగిసి ఎగ్జిట్ పోల్ (Exit Poll) ప్రిడిక్షన్లు కూడా వెలువడ్డాయి. ఎన్నికలు జరిగిన ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3వ తేది ఆదివారం ప్రకటించనున్నారు. నెల రోజుల పాటు ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ (Elections Code) అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల రోజుల్లో దాదాపు రూ.1766 కోట్ల నగదు, డ్రగ్స్, మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఓటర్ల (Voters)ను ఆకర్షించడానికి చాలా చోట్ల ఉచిత తాయిలాలు తరలిస్తూ పలువురు పోలీసులకు పట్టుబడ్డారు. ఐదు రాష్ట్రాల్లో (5 States Elections) మొత్తం 1766 కోట్ల నగదు, వస్తువులు, మద్యం, చీరలను అధికారులు స్వాధీనం (Rs.1766 crores Seized) చేసుకోగా అందులో ఒక్క తెలంగాణలోనే రూ.745 కోట్ల విలువైన డబ్బు, బంగారం, మద్యం, వస్తువులను అధికారులు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ (Election commission) కీలక సమాచారాన్ని ప్రకటించింది. 2018 ఎన్నికల్లో మిజోరాం, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎన్నికల్లో పోలిస్తే ఈసారి అధికంగా నగదు పట్టుబడినట్లు ఈసీ వెల్లడించింది. గతంతో పోలిస్తే ఈసారి 7 రెట్లు అధికంగా నగదు పట్టుబడినట్లుగా తెలిపింది. ఈసారి పోలింగ్ సమయంలో ఏ ఇబ్బందులు తలెత్తకుండా గట్టి చర్యలు తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. ఎన్నికల కోడ్ సమయంలో ఎక్కడా కూడా నగదు పంపిణీ చేయకుండా గట్టి నిఘా ఉంచామని, అయినప్పటికీ కొందరు నిబంధనలను ఉల్లంఘించారని, వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.