»Bomb Threat To 15 Schools At Bengaluru Police In The Field
Bomb threat: 15 స్కూళ్లకు బాంబు బెదిరింపు..రంగంలోకి పోలీసులు
ఆకస్మాత్తుగా ఈరోజు బెంగళూరులోని 15 స్కూళ్లకు బాంబు బెదిరింపు(Bomb threat) ఇమెయిల్స్ అందాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులు, ఇతర ఉపాధ్యాయులను ఖాళీ చేయించారు.
Bomb threat to 15 schools at bengaluru Police in the field
బెంగళూరు(bengaluru)లో 15కి పైగా పాఠశాలలకు శుక్రవారం అనామక ఇమెయిల్‌ల ద్వారా బాంబు బెదిరింపులు(Bomb threat) వచ్చాయి. దీంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, అధికారులు భయాందోళనలకు గురయ్యారు. ఈ రోజు ఉదయం సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చింది. తొలుత ఏడు స్కూళ్లకు ఈ బెదిరింపు మెయిళ్లు రాగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మరికొన్ని విద్యాసంస్థలకు అదే తరహా ఈ మెయిళ్లు(anonymous emails) వచ్చాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు..ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు.
#Karnataka Deputy Chief Minister #DKShivakumar visits one of the schools that received a bomb threat in #Bengaluru on December 1, 2023. Around 15 schools are said to have received security threat. School managements have shut down campuses and are have sent students back home. pic.twitter.com/Qj9O0CltLa
బెదిరింపు ఇమెయిల్‌లను అందుకున్న పాఠశాలల ఖచ్చితమైన సంఖ్య కచ్చితంగా తెలియనప్పటికీ, టెక్ సిటీలోని 15 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అక్కడి మీడియా నివేదికలు చెబుతున్నాయి. బసవేశ్వర్ నగర్‌లోని నేపెల్, విద్యాశిల్పతో సహా ఏడు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని మొదటి బెదిరింపులు చేశారు. అయితే బెదిరింపులకు గురైన పాఠశాలల్లో ఒకటి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్(dk shivakumar) నివాసానికి ఎదురుగా ఉండటం విశేషం.
బాంబు బెదిరింపులు బూటకమని సంకేతాలు ఉన్నప్పటికీ, పోలీసులు(police) బాంబు నిర్వీర్య స్క్వాడ్ల సహాయంతో ప్రాంగణంలో క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పాఠశాలలోనూ బాంబులు ఉన్నట్లు వారు ఇంకా ధృవీకరించలేదు. అంతేకాదు గత సంవత్సరం కూడా బెంగళూరులోని చాలా పాఠశాలలకు ఇలాంటి ఇమెయిల్ బెదిరింపులు వచ్చాయి. కానీ అవన్నీ బూటకమని తేలింది.