అభిషేకం పాలతోనో, తేనేతోనో చేస్తారని అందరికీ తెలుసు. కానీ కారంతో అభిషేకం చేయడాన్ని చాలా మంది చూసుండరు. అయితే ఇక్కడొక స్వామికి మాత్రం భక్తులు ఏకంగా 60 కేజీల కారంతో పూజలు చేశారు.
పోలీసు నియామక ప్రక్రియ విషయంలో ఏపీ హైకోర్టు(ap high court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏపీ ఎస్సై ఉద్యోగాల ఎంపిక విషయంలో ఎత్తు కొలిచే సమయంలో తమకు అన్యాయం జరిగిందని పలువురు కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
నాగార్జున సాగర్ ఇష్యూ ఏపీ, తెలంగాణ సీఎంలు సృష్టించిన కృతిమ గొడవ అని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.
జలపాతంలో 11 మంది అయ్యప్పస్వాములు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అయ్యప్ప స్వాములను కాపాడారు. 11 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
త్వరలో ఏపీలో 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని, 94 ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని సీఎం జగన్ తెలిపారు. నేడు వర్చువల్‌గా ఆయన పలు పరిశ్రమలను ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఏపీలో 86 వేల మందికి ఉపాధి లభించినట్లుగా వెల్లడించారు.
గ్యాస్ సిలిండర్ లీక్ కావడం వల్ల నలుగురు దుర్మరణం చెందారు. కొత్త గ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను సరిగా అమర్చలేదు. దీంతో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.
టీడీపీ నేత నేడు యువగళం పాదయాత్రలో భాగంగా అమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులతో, విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
సుప్రీం కోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కామ్ కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌పై నేడు విచారణ జరగ్గా సుప్రీం విచారణను డిసెంబర్ 8వ తేదికి వాయిదా వేసింది. బాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి సుప్రీం అనుమతులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ రూ.3,100 కోట్లతో 28 సబ్‌స్టేషన్‌లను నిర్మిస్తోంది. 28 ఏపీ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్లలో 12 సబ్‌స్టేషన్‌లను ప్రారంభించగా, 16 సబ్‌స్టేషన్‌లకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
తిరుమలను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని టీటీడీ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో నేటితోపాటు వచ్చే మూడురోజులు చిరుజల్లులు(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏర్పడిన వాయుగుండం వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి ఐఎండీ అధికారులు చెప్పారు.
ఏపీలోని విజయవాడలో నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణకు తేదీని ఖారారు చేశారు. ఈరోజు సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో భాగంగా ప్రకటించారు. దీంతోపాటు విగ్రహం ఎత్తును కూడా 206 అడుగులకు పెంచుతామన్నారు.
ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి తన రెండో భార్య సాక్షి కూడా సంతకం పెట్టారు. అయితే వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
పవన్ కల్యాణ్ కేవలం ప్యాకేజీ స్టార్ అని, తెలంగాణలో బీజేపీకి, ఆంధ్రలో టీడీపీ కోసం పనిచేసే రాజకీయ వ్యభిచారి అని అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచే వాడు నాయకుడు ఎలా అవుతాడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయ నటుడివా లేక విటుడివా అని అంబటి వ్యాఖ్యానించారు.