పవన్ కల్యాణ్ కేవలం ప్యాకేజీ స్టార్ అని, తెలంగాణలో బీజేపీకి, ఆంధ్రలో టీడీపీ కోసం పనిచేసే రాజకీయ వ్యభిచారి అని అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచే వాడు నాయకుడు ఎలా అవుతాడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయ నటుడివా లేక విటుడివా అని అంబటి వ్యాఖ్యానించారు.
Ambati Rambabu fired on Janasena leader Pawan Kalyan
Ambati Rambabu: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ(BJP) తరఫున ప్రచారం చేయడం పట్ల ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) విమర్శించారు. ”పదేళ్లుగా రాజకీయాలు చేస్తున్నావు. అసలు రాజకీయం అంటే ఏంటో తెలుసా, నువ్వు రాజకీయ నాయకుడివా, లేకపోతే రాజకీయ విటుడివా, రాజకీయ బ్రోకరువా అని వ్యాఖ్యానించారు. ”చంద్రబాబు(Chandrababu) సైలెంట్‌గా కూర్చుని కాంగ్రెస్(Congress)కు సపోర్ట్ చేస్తాడు. తెలంగాణలో ఎక్కడ కాంగ్రెస్ సభలు నిర్వహించినా అక్కడ టీడీపీ జెండాలు లేస్తున్నాయి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నాడు. మళ్లీ ఏపీకి వచ్చి టీడీపీకి సపోర్ట్ అంటాడు. అసలు నీ వ్యక్తిత్వం ఏంటి? నీ వ్యవహారం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటని అంబటి ధ్వజమెత్తాడు.
తెలంగాణలో ఓ నాటకం, ఏపీలో మరో నాటకం. రాజకీయం అంటే సినిమా అనుకున్నావా అని పవన్‌ను అంబటి విమర్శించారు. నీచమైన రాజకీయాలు చేసేది చంద్రబాబు అయితే, ఇప్పుడు ఆయన్నే మించిపోయిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ బీజేపీకి సెకండ్ సెటప్పువా..లేక టీడీపీకి సెకండ్ సెటప్పువా అని తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి రాజకీయ క్రీడల్లో పవన్ కల్యాణ్ మహత్తరమైన నాటకాలు ఆడుతున్నారని, కేవలం ప్యాకేజీలు తీసుకుని రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణలో ఒక డ్యాన్సు, ఏపీలో మరో డ్యాన్సు చేస్తావు. ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేయడానికి ఇవి సినిమాలు కావని, రాజకీయాలని అన్నారు. ఆయన పీకే కాదు కేకే అని. కేకే అంటే కిరాయి కోటిగాడు. ఎవరో చెప్పారు కిరాయి కోటిగాడు బాగా లేదండీ. కిరాయి కల్యాణ్ అనండి.. బాగా సూటవుతుందన్నారు. నువ్వు నిజంగా కిరాయి కల్యాణ్ వే. రౌడీలు కిరాయి తీసుకుని హత్యలు చేస్తుంటారు. నువ్వు కిరాయి తీసుకుని రాజకీయ హత్యలు చేస్తావంటూ అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు.