AP rains: ఏర్పడిన ఆల్పపీడనం..ఏపీలో మూడు రోజులు వర్షాలు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో నేటితోపాటు వచ్చే మూడురోజులు చిరుజల్లులు(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏర్పడిన వాయుగుండం వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి ఐఎండీ అధికారులు చెప్పారు.
బంగాళాఖాతం సమీపంలోని దక్షిణ అండమాన్ పరిధిలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. ఈ క్రమంలో వాయువ్య, పశ్చిమ దిశగా ఇది కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని చెప్పారు. ఆ తర్వాత వాయువ్య దిశగా కదిలి వచ్చే 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) దిగువన ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు బలంగా వీస్తున్నాయి.
వీటి ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో ఏపీలోని పలు చోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా తమిళనాడు, కోస్తా ఆంధ్ర ప్రదేశ్తో పాటు అండమాన్ మరియు నికోబార్ దీవులపై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు పశ్చిమ హిమాలయాల ఎగువ ప్రాంతాలలో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది.